పొలిటికల్ డ్రామా
అగస్త్య, నక్షత్ర జంటగా సురేఖ ప్రొడక్షన్స్ పతాకంపై నందిగం వెంకట్ నిర్మాతగా దర్శకుడు నానాజీ మిరియాల రూపొందిస్తున్న సినిమా ‘బాపట్ల ఎంపీ నందిగం సురేష్’. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నందిగం వెంకట్ మాట్లాడుతూ…‘సామాన్య దళిత కుటుంబంలో పుట్టిన ఓ వ్యక్తి ప్రజాదరణ పొంది బలమైన నాయకుడిగా ఎలా ఎదిగాడు అనేది ఈ చిత్ర కథాంశం.
ప్రజా జీవితంలో అతను ఎదిగే క్రమంలో ఎదురైన ఆటంకాలు ఏంటి? వాటిని ఎలా అధిగమించాడు అనేది సినిమాలో చూపిస్తున్నాం’ అన్నారు. దర్శకుడు నానాజీ మిరియాల మాట్లాడుతూ…‘ఏ పని చేసినా నిజాయితీగా చేస్తే జీవితంలో ఎదుగుతాం అని చెప్పే చిత్రమిది. ప్రతి సామాన్యుడు చూసి స్ఫూర్తి పొందే విధంగా సినిమా ఉంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం : అనూప్ రూబెన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- agastya
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

