Devil | బింబిసార సక్సెస్‌తో ‘డెవిల్’కు డిమాండ్
కల్యాణ్‌రామ్ (Kalyan Ram) టైటిల్ రోల్లో నటించిన ప్రాజెక్టు బింబిసార. ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచి అన్ని సెంటర్లలో మంచి టాక్ తెచ్చుకోవడమే కాదు..బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటుకొని..లాభాల బాట పట్టినట్టు ఇప్పటివరకున్న సమాచారం.
వశిష్ఠ (Vasistha) దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ (Kalyan Ram) టైటిల్ రోల్లో నటించిన ప్రాజెక్టు బింబిసార. మగధ రాజ్యాన్ని పాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ బింబిసారుడిగా, దేవదత్తుడిగా డ్యుయల్ రోల్లో కనిపించాడు. కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు.
ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచి అన్ని సెంటర్లలో మంచి టాక్ తెచ్చుకోవడమే కాదు..బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటుకొని..లాభాల బాట పట్టినట్టు ఇప్పటివరకున్న సమాచారం. కాగా బింబిసార సక్సెస్ ట్రాక్ లో వెళ్తున్న నేపథ్యంలో కల్యాణ్ రామ్ చేస్తున్న మరో చిత్రం డెవిల్ (Devil) కు క్రేజ్ భారీగా పెరిగిందట. ఈ సినిమా కూడా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతుండగా..కల్యాణ్‌రామ్ క్రేజీ రోల్లో కనిపించనున్నాడు.
డెవిల్ అవుట్ పుట్ కూడా ఉత్తమంగా ఉండబోతుందన్న టాక్ తెరపైకి రావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగబోతుందని జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన డెవిల్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉంది. నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

