Mollywood | టాలీవుడ్లో మాలీవుడ్ విలన్ల హవా… స్టార్ హీరోలకి సరిపోతున్న కొత్త సైకో విలన్స్!
Mollywood |తెలుగు సినిమా స్థాయి దేశవ్యాప్తంగా పెరిగిపోయినకొద్దీ, హీరోలతో పాటు విలన్ల ఎంపికలో కూడా విప్లవాత్మక మార్పులు రావడం మొదలైంది. ఒకప్పుడు మన హీరోలకు సరిపోయే విలన్ల కోసం బాలీవుడ్ నటులను తీసుకొచ్చేవారు.
Mollywood |తెలుగు సినిమా స్థాయి దేశవ్యాప్తంగా పెరిగిపోయినకొద్దీ, హీరోలతో పాటు విలన్ల ఎంపికలో కూడా విప్లవాత్మక మార్పులు రావడం మొదలైంది. ఒకప్పుడు మన హీరోలకు సరిపోయే విలన్ల కోసం బాలీవుడ్ నటులను తీసుకొచ్చేవారు. అయితే ఇప్పుడు ఆ ఫార్ములా మార్చేశారు. కండలు కాకుండా కళ్లలో కసి, పాత్రలో లోతు, నటనలో వైవిధ్యం ఉన్న నటులను దర్శకులు వెతికిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సెర్చ్‌లో వారికి దొరికిన మైన్స్ .. మలయాళ ఇండస్ట్రీ!
ఇప్పుడైతే టాలీవుడ్లో మాలీవుడ్ విలన్ల హవా గట్టిగా నడుస్తోంది. స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాల్లో కేరళ స్టార్లు పవర్ ఫుల్ నెగిటివ్ రోల్స్‌లో కనిపించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో మహేష్ బాబు చేస్తున్న భారీ ప్రాజెక్ట్ “వారణాసి” కోసం విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఎంపిక చేయడం సెన్సేషన్‌గా మారింది. ఈ సినిమాలో ఆయన “కుంభా” అనే పాత్రలో కనిపించబోతున్నారు. వికలాంగుడిలా కనిపించే ఈ పాత్ర లోపల మాత్రం రాక్షసుడితో నిండిపోయి ఉంటుంది. తెరపై ఆయన ఎలాంటి భయం పుట్టించబోతున్నారో చూసేందుకు ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్ తీస్తున్న ఎన్టీఆర్ చిత్రంలో విలన్‌గా మరో మలయాళ హీరో టోవినో థామస్ కనిపించనున్నారనే వార్త భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అధికారిక ప్రకటన రాకపోయినా, టాలీవుడ్ వర్గాల్లో ఈ బజ్ గట్టిగా వినిపిస్తోంది. ‘పుష్ప’లో ఫహద్ ఫాజిల్ చేసిన భన్వర్ సింగ్ పాత్ర తెలుగు విలన్లకు కొత్త డైమెన్షన్ ఇచ్చింది. పుష్ప 2లో ఆయన పాత్ర మరింత భయానకంగా కనిపించిందని పలువురు క్రిటిక్స్ అంటున్నారు. ఇటీవల వరుసగా టాలీవుడ్ సినిమాల్లో శైన్ టామ్ చాకో తనదైన స్టైల్‌తో విలన్ పాత్రలకి కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు. దసరా (నాని), దేవర (ఎన్టీఆర్), డాకు మహారాజ్ (బాలయ్య), రాబిన్ హుడ్ (నితిన్) ప్రతి సినిమాలో వేరువేరు షేడ్స్‌తో అతను ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల సునీల్ శెట్టి మాట్లాడుతూ .. టాలీవుడ్ ఇప్పుడు కేవలం బాలీవుడ్ వైపు మాత్రమే కాదు… దేశమంతా టాలెంట్ వెతుకుతోంది” అని చెప్పడం విశేషం. మొత్తం మీద… మాలీవుడ్ విలన్ల ఎంట్రీతో తెలుగు సినిమాల్లో కొత్త స్టైల్, కొత్త టెర్రర్, కొత్త మాస్ డోస్ చేరింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

