Mohan Babu: సాయి తేజ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన మోహన్ బాబు

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.ఆయన ఆరోగ్యం క్రమక్రమేపి కుదుట పడుతుంది. అయితే పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రి వద్దకు చేరుకొని సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నారు. ఇంకొందరు సోషల్ మీడియా వేదికగా సాయి తేజ్ పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.
తాజాగా మంచు మోహన్ బాబు తన కూతరు మంచు లక్ష్మీతో కలిసి అపోలో ఆసుపత్రికి చేరుకొని సాయి ధరమ్ తేజ్‌ని పరామర్శించారు. సాయిధరమ్ తేజ్‌ను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాయిబాబా ఆశీస్సులతో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఆయన తిరిగి బయటికి వస్తాడు అని చెప్పారు.
మోహన్ బాబు వ్యాఖ్యలు అభిమానులకి కాస్త ఉపశమనం కలిగించినట్టు అయింది. రీసెంట్గా సాయి తేజ్‌కి కాలర్ బోన్ సర్జరీ చేయగా, అది సక్సెస్ అయింది ఆయన క్రమక్రమంగా కోలుకుంటున్నాడని, 36 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలని వైద్యులు అన్నారు. సెప్టెంబర్ 10న కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా రోడ్డుపై ఇసుక ఉండడంతో అతడి స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయి అదుపుతప్పి పడిపోయిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

