సంతోష్‌రాజా, శ్రేయాస్ సేన్ జంటగా నటిస్తున్న ప్రేమకథాచిత్రం ‘మొహబ్బత్’. మ్యాక్ దర్శకత్వంలో అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. హీరో నవదీప్, దర్శకుడు కరుణకుమార్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
కొత్త విషయం చెప్పాలన్న తాపత్రయంతో చేసిన సినిమా ఇదని దర్శకుడు మ్యాక్ తెలిపారు. కథపై నమ్మకంతోనే ఈ సినిమాను నిర్మించామని నిర్మాత అఫ్రోజ్ షేక్ చెప్పారు. కడపలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తీసిన ఎమోషనల్ లవ్‌స్టోరీ ఇదని హీరో సంతోష్ పేర్కొన్నారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల హీరోయిన్ శ్రేయాస్ సేన్ ఆనందం వెలిబుచ్చారు.