శభాష్ మొగులయ్య
ఆడగాదు.. ఈడగాదు
అమీరోళ్ల మేడా గాదు
గుర్రం నీళ్లా గుట్టా కాదు
బెమ్మాజెముడు చెట్టున్నాది

సెభాష్ భీమ్లానాయకా…. అంటూ పవన్ కల్యాణ్ ‘భీమ్లానాయక్’ టీజర్లో సాగే పాటలో కొత్త గొంతు ప్రపంచానికి వినిపిస్తుంది. ఈ పాటలో పాలమూరు కళాకారుడు దర్శనం మొగులయ్య మెరిశాడు. తన 12 మెట్ల కిన్నెరతో భీమ్లానాయక్ గురించి పాడే పాట ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్‌లో విడుదల చేసిన ఈ టీజర్‌ను కేవలం 5 గంటల్లో 4 మిలియన్ల మంది వీక్షించారు. ప్రత్యేకంగా కిన్నెరతో మొగులయ్య పాడిన పాట, ఆయన గొంతు అందరినీ ఆకట్టుకుంటోంది. మన మొగిలయ్య కిన్నెరకు భలే గుర్తింపు వచ్చిందని పాలమూరు జనం చర్చించుకుంటున్నారు. పాటలో నల్లమల బ్యాక్ డ్రాప్ గురించి అదే ప్రాంతానికి చెందిన కళాకారుడు మొగులయ్య పాడటం వల్లే ఈ టీజర్ హైలెట్ అయ్యిందని పాలమూరు వాసులు అంటున్నారు.
పవన్ కళ్యాణ్ పిలిచి పాట పాడాలన్నారు..
‘నాగర్‌కర్నూలు జిల్లా లింగాల మండలం అవుసలకుంటలోని మా ఇంట్లో ఉండగా సినిమా హీరో పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. భీమ్లానాయక్ సినిమా కోసం పాట పాడాలని కోరారు. నమ్మలేకపోయాను. ముత్తాతల కాలం నుంచి వస్తున్న పన్నెండు మెట్ల కిన్నెర వాయించుకుంటూ చిన్న చిన్న కార్యక్రమాలు చేసే నేను అంత పెద్ద హీరో సినిమాలో పాట పాడాలంటే కొద్ది సేపు అర్థం కాలేదు. హైదరాబాద్‌లో ఓ వారం రోజుల పాటు హోటల్లో ఆ పాట నాతో పాడించారు. ఇవాళ ఆ పాట విడుదల కాగానే నాకు అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. మొగులయ్య ఇన్నాళ్లకు నీకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందని అందరూ అంటున్నారు.
500 ఏండ్ల నుంచి ఉన్న 12 మెట్ల కిన్నెరకు, మా పాటకు గుర్తింపు రావడం సంతోషంగా ఉన్నది. పెద్ద సినిమా ద్వారా నేను ప్రపంచానికి పరిచయం అవ్వడం మర్చిపోలేను. తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాతే నన్ను గుర్తిస్తున్నారు. నా పేదరికాన్ని చూసి సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నాకు ప్రత్యేకంగా నెలనెలా కళాకారులకు ఇచ్చే పింఛన్ రూ.10 వేలు అందిస్తున్నారు. ఉగాది పురస్కారం ఇచ్చి తెలంగాణ సర్కారు నన్ను గౌరవించింది. 8వ తరగతి పాఠ్యపుస్తకంలోనూ నా గురించి రాయడం ఎంతో సంతోషాన్నిస్తోంది. తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న 12 మెట్ల కిన్నెర కళ అంతరించిపోకుండా కాపాడుతున్నందుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటాను’ అని మొగులయ్య ఆనందం వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

