ఎవరికోసమో ఎదురుచూపులు..
తమిళ, మలయాళ భాషల్లో యువతరంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది మిర్నా మీనన్. ముఖ్యంగా రజనీకాంత్ ‘జైలర్' చిత్రంలో ఆమె పాత్రకు మంచి పేరొచ్చింది.
తమిళ, మలయాళ భాషల్లో యువతరంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది మిర్నా మీనన్. ముఖ్యంగా రజనీకాంత్ ‘జైలర్’ చిత్రంలో ఆమె పాత్రకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం ఈ సొగసరి నాగార్జున ‘నా సామిరంగ’ చిత్రంలో రెండో నాయికగా నటిస్తున్నది. విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ‘నా సామిరంగ’ చిత్రంలో మంగ పాత్రలో మిర్నా మీనన్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఈ అమ్మడు సంప్రదాయం ఉట్టిపడే చీరకట్టులో అచ్చ తెలుగందంతో మెరిసిపోతున్నది. నచ్చిన చెలికాడి కోసం ఎదురుచూపులు చూస్తున్నట్లుగా ప్రశాంత వదనంతో కనిపిస్తున్నది. గ్రామీణ నేపథ్యంలో హృదయాన్ని కదిలించే ప్రేమకథ, స్నేహం అంశాల కలబోతగా ‘నా సామిరంగ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మిర్నా మీనన్ పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. అల్లరి నరేష్, రాజ్‌తరుణ్, ఆషికా రంగనాథ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర దాశరథి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, దర్శకత్వం: విజయ్ బిన్ని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

