Mirai Teaser | తేజ సజ్జా, మంచు మనోజ్ ‘మిరాయ్’ టీజర్ వచ్చేసింది
Mirai Teaser | 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మిరాయ్ (Mirai).
Mirai Teaser | ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మిరాయ్ (Mirai). మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, మైథాలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్-అడ్వెంచర్‌గా రాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
టీజర్ చూస్తుంటే.. మౌర్య చక్రవర్తి అశోకుడికి సంబంధించిన రహస్యాలు, తొమ్మిది రహస్య గ్రంథాలు, ఒక శక్తివంతమైన ఆయుధం ‘మిరాయ్’ చుట్టూ ఈ కథ అల్లుకుని ఉంది. మానవజాతిని నాశనం చేయాలని చూస్తున్న ఒక చీకటి శక్తిని అడ్డుకోవడానికి తేజ సజ్జా పోరాడుతుంటాడు. ఈ చీకటి శక్తికి అధిపతిగా మంచు మనోజ్ ‘ది బ్లాక్ స్వార్డ్’ గా భయంకరమైన విలన్ పాత్రలో నటిస్తున్నారు. టీజర్లో మనోజ్ పవర్ఫుల్ లుక్, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచాయి.
విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాలు, భారీ విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. తేజ సజ్జా అమాయకుడిగా కనిపించి, ఆ తర్వాత సూపర్ యోధుడిగా మారే పరిణామక్రమం, రైలుపై యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. రీతికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియా సరన్, జయరామ్, జగపతి బాబు వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
‘మిరాయ్’ సినిమా సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో, 2D మరియు 3D ఫార్మాట్లలో విడుదల కానుంది. ‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జా నుండి వస్తున్న ఈ మరో సూపర్ హీరో చిత్రం ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

