మ్యారేజ్ డే స్పెషల్.. క్యూట్ ఫొటో షేర్ చేసిన మిహికా

కరోనా సమయంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న స్టార్ నటుడు రానా. మిహికా బజాజ్‌తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఆయన ఆగస్ట్ 9, 2020న వివాహం చేసుకున్నాడు. నేటితో వారి వివాహం జరిగి ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా మిహికా తన భర్తతో కలిసి దిగిన అందమైన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. శుభాకాంక్షలు తెలిపింది.
రానాతో ఏడడుగులు నడిచి ఏడాది పూర్తయిన సందర్భంగా భర్తపై ప్రేమను కురిపిస్తూ మన బంధం ఎంతో అద్భుతం. నా లవ్‌కి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది ఎంతో ఆనందంగా గడిచింది. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నా జీవితంలో మంచి మనసున్న మనిషిగా తోడున్నావు. థ్యాంక్యూ మై లైఫ్.. మై లవ్ అంటూ మిహికా తన ప్రేమను వ్యక్తపరచింది.
మిహికా పెట్టిన పోస్ట్‌కి స్పందించిన సమంత.. మీ ఇద్దరిపై దేవుని అనుగ్రహం ఉండాలని కామెంట్ చేసింది. ఇక శృతి హాసన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ లవ్లీస్ అని కామెంట్ పెట్టింది. మిహికా షేర్ చేసిన ఫోటోలో రానా కెమెరా వైపుగా చూస్తుంటే.. మిహికా మాత్రం రానా కళ్ళలోకి చూస్తూ ఆయన ప్రేమలో మునిగినట్టు కనిపిస్తుంది. .ఇక దగ్గుబాటి రానా కెరీర్ విషయానికి వస్తే .. ప్రస్తుతం ఆయన ”విరాటపర్వం, హాతి మేరే సాతి” సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

