Michael B Jordan | హాలీవుడ్ స్టార్ హీరో, ఆస్కార్ విజేత ‘సిన్నర్స్’ ఫేమ్ మైకేల్ బి జోర్డాన్ తన నిర్మాణ సంస్థ ‘అవుట్లియర్ సొసైటీ’ ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియోతో చేతులు కలిపి మూడు భారీ ప్రాజెక్టులను ప్రకటించి అందరినీ ఒక్కసారిగా షాక్‌కి గురిచేశాడు.
ఈ ప్రాజెక్ట్‌లలో భాగంగా.. బాక్సింగ్ లెజెండ్ మొహమ్మద్ అలీ జీవిత కథ ఆధారంగా ‘ద గ్రేటెస్ట్’ అనే పేరుతో ఒక స్క్రిప్టెడ్ సిరీస్‌ను రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో విశేషమేమిటంటే, మొహమ్మద్ అలీ కుటుంబం అధికారికంగా ఆమోదించిన తొలి బయోపిక్ సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఇందులో జాలెన్ బెస్ట్ మొహమ్మద్ అలీగా నటిస్తుండగా, మైకేల్ ఈలీ, ఓమారి హార్డ్‌విక్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అలీ భార్య లోనీ అలీ స్వయంగా ఈ ప్రాజెక్టుకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. వీటితో పాటు జోర్డాన్ తన పాపులర్ ‘క్రీడ్’ ఫ్రాంచైజీ నుంచి ‘డెల్ఫీ’ అనే స్పిన్-ఆఫ్ సిరీస్‌ను కూడా ప్రకటించారు. డెల్ఫీ బాక్సింగ్ అకాడమీ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ షూటింగ్ మే 18 నుంచి లాస్ ఏంజెల్స్‌లో ప్రారంభం కానుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ‘ఫోర్త్ వింగ్’ నవల ఆధారంగా డ్రాగన్ రైడర్స్ నేపథ్యంతో కూడిన మరో ఫాంటసీ డ్రామాను కూడా ఆయన తెరకెక్కిస్తున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మైకేల్ బి జోర్డాన్ తీసుకున్న ఈ నిర్ణయాలు ఇప్పుడు సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి.
A new era begins. 🥊
At Amazon’s Upfront presentation, Michael B. Jordan officially unveiled “The Greatest” – the first-ever authorized series about the life and legacy of Muhammad Ali.
Variety: https://t.co/pMLvbAiDSr
USA Today: https://t.co/1PArF1rWCX pic.twitter.com/HZV5zgfDGO— Muhammad Ali (@MuhammadAli) May 12, 2026