Mollywood #MeToo: మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో వేధింపులు.. 17 కేసులు నమోదు
Mollywood #MeToo: మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు ఇటీవల హేమ కమీషన్ తన రిపోర్టులో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో 17 కేసులు నమోదు అయ్యాయి. నటులు, నిర్మాతలు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆ కేసు దాఖలు చేసినవారు ఆరోపించారు.
న్యూఢిల్లీ: మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు(Mollywood #MeToo) జరుగుతున్నట్లు ఇటీవల హేమ కమీషన్ తన రిపోర్టులో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో 17 కేసులు నమోదు అయ్యాయి. నటులు, నిర్మాతలు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆ కేసు దాఖలు చేసినవారు ఆరోపించారు. దీంతో అమ్మా సంస్థను రద్దు చేశారు. అనేక మంది సినీ తారలు, నిర్మాతలను .. లైంగిక వేధింపుల కేసులో విచారించనున్నారు.
తాజాగా నటి సోనియా మలహార్ ఫిర్యాదు చేసింది. 2013లో ఓ ఫిల్మ్ సెట్లో ఓ నటుడు తనను వేధించినట్లు ఆమె ఆరోపించారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో చోటుచేసుకుంటున్న మీటూ ఆరోపణలపై కేరళ సర్కారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఆ బృందానికి నటి సోనియా ఫిర్యాదు చేసింది. నటుడు జయసూర్యతో తనకు లింకు ఉన్నట్లు ఆరోపణలు చేయరాదు అని మీడియాను కోరిందామె.
లైంగిక ఆరోపణలు చేసిన నటి మిను మునీర్ కు బెదిరింపు మెసేజ్‌లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఎం ముకేశ్, జయసూర్య, మణియన్పిల్లై రాజు, ఇడవేల బాబు వేధించినట్లు గతంలో ఆమె ఆరోపించారు. బెదిరంపునకు చెందిన మెసేజ్‌ను ఆమె తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. సిట్ సభ్యులు ఆమె చేసిన ఫిర్యాదుపై వాంగ్మూలం తీసుకోనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

