రా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బీవీఎస్ రవి నిర్మించిన సీరీస్ “మేము కాప్’లం’. ‘వికటన్’ఫేం ప్రదీప్ మద్దాలి దర్శకుడు. నాగబాబు ప్రధాన పాత్రధారి. గెటప్‌శ్రీను, రవితేజ సన్నిమాల కీలక పాత్రధారులు. నేటి నుంచి జీ 5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నది. గురువారం హైదరాబాద్‌లో ప్రివ్యూ ఈవెంట్‌ని నిర్వహించారు. ‘కోడి పోవడంతో దాన్ని పట్టుకునేందుకు ఇద్దరు పోలీసులు రంగంలోకి దిగుతారు.
ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే ఈ సినిమా కథ. గెటప్ శ్రీను, రవితేజ సన్నిమాల కాంబినేషన్ సీన్స్ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి. నాగబాబు ఈ ప్రాజెక్ట్‌లోకి రావడంతో ఈ సిరీస్ స్థాయి పెరిగింది’ అని నిర్మాత బీవీఎస్ రవి అన్నారు. ఇంకా జీ5 ప్రతినిధి అనురాధ, డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి, సంగీత దర్శకుడు సాకేత్ కొమండరి కూడా మాట్లాడారు.