కామెడీ చేస్తానంటే నమ్మలేదు!

‘అతి ఆలోచనలు, భయాలు మనుషుల మానసిక, శారీరక ఆరోగ్యాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే పాయింట్‌తో మారుతి ఈ సినిమాను తెరకెక్కించారు. మన ఇంట్లో, తెలిసిన వారి జీవితాల్లో జరిగిన కథలా అనిపిస్తుంది’ అని చెప్పింది మెహరీన్. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. మారుతి దర్శకుడు. వి.సెల్యూలాయిడ్, ఎస్కేఎన్ నిర్మించారు. ఈ నెల 4న విడుదలకానుంది. ఆదివారం హైదరాబాద్‌లో మెహరీన్ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..
నా కెరీర్లో కథ వినకుండా అంగీకరించిన తొలి సినిమా ఇది. మారుతితో పాటు యూవీ క్రియేషన్స్‌పై నమ్మకంతో సినిమా చేశా. ఇందులో పద్మ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా కనిపిస్తా. తండ్రి అతి ప్రేమ కారణంగా ఇబ్బందులు పడే కూతురిగా నా పాత్ర విభిన్నంగా ఉంటుంది. తన సహోద్యోగితో ప్రేమలో పడిన ఆమెకు తండ్రి కారణంగా ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయన్నది నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది.
కన్నడంలో శివరాజ్‌కుమార్‌తో..
మార్చిలో కొవిడ్ బారిన పడటంతో జూన్ వరకు ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టలేదు. లాక్డౌన్ టైమ్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆ సమయంలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండటంతో సెట్స్‌లో రెండు రోజులు చాలా భయపడ్డా. నిజజీవితంలో నేను చాలా ఫన్నీగా ఉంటా. ఆ మనస్తత్వం వల్లే సినిమాల్లో వినోదాన్ని పండించడం సులభమవుతోంది. ‘ఎఫ్-2’లో హనీ పాత్రకు ఎంపిక చేసినప్పుడు నేను కామెడీ చేస్తానంటే ఎవరూ నమ్మలేదు. అనిల్‌రావిపూడి నమ్మకం వల్లే ఆ పాత్రకు మంచి పేరొచ్చింది. ఒకే పంథాకు పరిమితం కాకుండా అన్ని రకాల పాత్రలు చేయాలనుంది. లాక్డౌన్ విరామంలో ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టి బరువు తగ్గాను. వర్కవుట్స్‌కు ఎక్కువగా సమయాన్ని కేటాయించా. ప్రస్తుతం ‘ఎఫ్-3’ తో పాటు కన్నడంలో శివరాజ్‌కుమార్‌తో ఓ సినిమా చేస్తున్నా. మరో రెండు సినిమాల్ని అంగీకరించా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

