కన్నడంలో అరంగేట్రం

వ్యక్తిగత కారణాలతో భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న పంజాబీ సుందరి మెహరీన్ తిరిగి సినీకెరీర్పై దృష్టిసారిస్తోంది. ప్రేమకథా చిత్రాలతో తెలుగు, తమిళ భాషల్లో చక్కటి గుర్తింపును సొంతం చేసుకున్న ఆమె తాజాగా కన్నడంలో అరంగేట్రం చేయబోతున్నది. శివరాజ్‌కుమార్ కథానాయకుడిగా రామ్ ధూలిపూడి దర్శకత్వంలో ఓ కన్నడ చిత్రం తెరకెక్కుతోంది. ఎమోషనల్ లవ్‌స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రంతో మెహరీన్ కన్నడ చిత్రసీమలో అడుగుపెట్టబోతున్నది. కథానాయిక పాత్ర కోసం పలువురు అగ్ర తారలను పరిశీలించిన చిత్రబృందం మెహరీన్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ సినిమాలో పల్లెటూరి యువతిగా, స్వతంత్య్రభావాలు కలిగిన ఆధునిక అమ్మాయిగా భిన్న పార్శాలతో ఆమె పాత్ర సాగనున్నట్లు తెలిసింది. కథ, తన పాత్రలోని వైవిధ్యత నచ్చడంతో మెహరీన్ ఈ సినిమాను అంగీకరించినట్లు చెబుతున్నారు. శివరాజ్‌కుమార్ ఈ చిత్రంలో ఆర్మీ అధికారిగా కనిపించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మెహరీన్ తెలుగులో ‘ఎఫ్-3’, ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమాల్లో కథానాయికగా నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

