KGF Chapter-2 | ‘కేజీఎఫ్-2’ నుంచి విడుదలైన మెహబూబా వీడియో సాంగ్
Mehabooba Video song | ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ‘కేజీఎఫ్ చాప్టర్-2’ ఎలాంటి విధ్వంసాలను సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . సౌత్ నార్త్ అని తేడా లేకుండా విడుదలైన ప్రతి భాషలో వసూళ్ళ వర్షాన్ని కురిపిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం రూ.1100కోట్ల మార్క్‌ను అధిగమించి రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఈ చిత్రం అన్ని భాషల్లో బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కలెక్షన్లలో ఖాన్, కపూర్లను సైతం వెనక్కి నెట్టి రాఖీ బాయ్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఇప్పటివరకు ఈ చిత్రం హిందీలో రూ.410 కోట్లకు పైగా వసూళ్ళు చేసి రికార్డులు సృష్టిస్తుంది. చిత్రం విడుదలై 25రోజులు దాటిన కలెక్షన్లలో మాత్రం జోరు తగ్గడం లేదు. ఈ సినిమా ఇంద పెద్ద విజయం సాధించడంలో సంగీత దర్శకుడు రవి బస్రూర్ ముఖ్య పాత్ర వహించాడు. ఈయన కంపోజ్ చేసిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి హైలెట్‌గా నిలిచాయి.
తాజాగా ఈ చిత్రంలోని ‘మెహబూబా’ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. రొమాంటిక్ మెలోడియస్గా సాగే ఈ పాట లిరికల్ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు వీడియో సాంగ్ విడుదలడంతో శ్రోతలు ఖుషి అయ్యారు. ఇటీవలే విడుదలైన ఎదగరా వీడియో సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో యష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ కీలకపాత్రల్లో నటించారు. బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

