చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’. మోహన్‌రాజా దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ పతాకాలపై ఆర్.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నయనతార కథానాయిక. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు వీడియో గ్లింప్స్‌ను సోమవారం విడుదల చేశారు. ఇందులో చిరంజీవి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో స్టెలిష్‌గా ఉన్నారు. వీడియో గ్లింప్స్‌లో చిరంజీవి గాడ్‌ఫాదర్ రోల్లో పవర్‌ఫుల్‌గా కనిపించారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. పూరి జగన్నాథ్, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రచంచవ్యాప్తంగా భారీస్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నీరవ్‌షా, సంగీతం: తమన్, నిర్మాణ సంస్థలు: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్‌ఫిల్మ్స్, సమర్పణ: కొణిదెల సురేఖ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా.