దర్శకత్వానికి దైవత్వాన్ని తీసుకొచ్చారు
కళాతపస్వి కె.విశ్వనాథ్ తన హృదయంలో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటారని, ఆయన తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి అని అన్నారు అగ్ర నటుడు చిరంజీవి. ఇటీవలే దివికేగిన దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ జయంతి వేడుకల్ని ‘కళాతపస్వికి కళాంజలి’ పేరుతో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
కళాతపస్వి కె.విశ్వనాథ్ తన హృదయంలో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటారని, ఆయన తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి అని అన్నారు అగ్ర నటుడు చిరంజీవి. ఇటీవలే దివికేగిన దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ జయంతి వేడుకల్ని ‘కళాతపస్వికి కళాంజలి’ పేరుతో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్‌తో కలిసి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు జ్ఞాపికల్ని అందజేశారు. ఈ సందర్భంగా వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ ‘నటనలో సున్నితమైన భావోద్వేగాల్ని ఎలా పలికించాలో విశ్వనాథ్‌గారి నుంచే నేర్చుకున్నా. ఆయన మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని నేటితరం వారు ఎదగాలని కోరుకుంటున్నా’ అన్నారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘భాషా భేదాలతో సంబంధం లేకుండా ఆనాడే పాన్ ఇండియా సినిమాలు చేసిన ఘనత కె.విశ్వనాథ్ సొంతం.
భవిష్యత్తు తరాలకు సినిమాల పరంగా ఆయనొక విజ్ఞాన నిధి. ‘అన్నమయ్య’ ‘శ్రీమంజునాథ’ చిత్రాలతో నా జన్మధన్యమైందని ఆయన నన్ను మెచ్చుకునేవారు’ అని చెప్పారు. దర్శకత్వానికి దైవత్వాన్ని ఆపాదించిన గొప్ప దిగ్గజం కె.విశ్వనాథ్ అని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. కె.విశ్వనాథ్ తీసిన ‘శంకరాభరణం’ చిత్రంతో తెలుగు రాష్ర్టాల్లో సంగీత పాఠశాలలు వెలిశాయని, అంతలా ఆయన మన సంస్కృతి, సంప్రదాయాలపై మక్కువ పెంచుకునేలా చేశారని ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ ప్రసాద్, మురళీమోహన్, మంజు భార్గవి, రాజ్యలక్ష్మి, రోజా రమణి, భానుచందర్, మీనా, జయసుధ, రాధిక, సుమలత, ఆమని, సి.అశ్వనీదత్, ఏడిద శ్రీరామ్, కాశీవిశ్వనాథ్, ఎస్వీ కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, కె.ఎస్.రామారావు, తనికెళ్ల భరణి, జీవిత, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mohammed Shami: టెస్టు క్రికెట్‌కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

