Meenakshi Chaudhary | మీకు చీరంటే ఇష్టమా? అభిమాని ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చిన మీనాక్షి చౌదరి
Meenakshi Chaudhary | మామూలుగానే అందగత్తె. దానికితోడు కళ్లు మిరుమిట్లు గొలిపే వస్త్రధారణ. ఆ అందానికి ఆ జిగేలు తోడైతే.. ఏంటి? ఇదేదో షాపింగ్‌మాల్ యాడ్‌కి సంబంధించిన స్క్రిప్ట్ అనుకుంటున్నారా?.. మీనాక్షి చౌదరి ఇన్స్టాలోకెళ్లి ఆమె స్టిల్స్ చూస్తే ఇలాంటి ఎక్స్‌ప్రెషన్సే వస్తాయి.
Meenakshi Chaudhary | మామూలుగానే అందగత్తె. దానికితోడు కళ్లు మిరుమిట్లు గొలిపే వస్త్రధారణ. ఆ అందానికి ఆ జిగేలు తోడైతే.. ఏంటి? ఇదేదో షాపింగ్‌మాల్ యాడ్‌కి సంబంధించిన స్క్రిప్ట్ అనుకుంటున్నారా?.. మీనాక్షి చౌదరి ఇన్స్టాలోకెళ్లి ఆమె స్టిల్స్ చూస్తే ఇలాంటి ఎక్స్‌ప్రెషన్సే వస్తాయి. కళ్లు తిప్పుకోలేం. పాత సినిమాల్లో హీరోయిన్లా కొన్ని కొన్ని స్టిల్స్‌లో నిండుగా చీరకట్టుకున్న మీనాక్షి చౌదరిని చూస్తే గుండె బరువెక్కక మానదు. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువమంది హృదయాలను కొల్లగొట్టేసింది మీనాక్షి.
సంక్రాంతికి రానున్న ‘గుంటూరుకారం’తో ఈ ముద్దుగుమ్మ స్టార్హీరోయిన్గా అవతరించడం ఖాయమని పలువురు బలంగా నమ్ముతున్నారు. ఇటీవల తన ఇన్‌స్టాలో ఫ్యాన్స్‌తో సరదాగా చిట్‌చాట్ చేసిందీ అందాల భామ. మీకు చీరంటే ఇష్టమా? అనడిగితే- ‘నాకు తెలిసి.. స్త్రీ అందాన్ని చీర ఆవిష్కరించినట్టు ఏ డ్రెస్సూ ఆవిష్కరించదు.
నా ఆల్‌టైమ్ ఫేవరెట్ శారీ..’ అంటూ బదులిచ్చింది మీనాక్షి. మహేశ్‌బాబుతో సినిమా చేస్తున్నారుకదా.. ఎలావుంది ఎక్స్పీరియన్స్ అనంటే ‘ ఆయన చాలా కూల్. సందర్భోచితంగా నవ్వించడంతో దిట్ట. అంతపెద్ద సూపర్‌స్టార్ అయ్యుండి కూడా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయన నవ్వుతూ ఉంటారు.. అందర్నీ నవ్విస్తూ ఉంటారు. ‘గుంటూరుకారం’లో ఆయనతో నాకు డ్యూయెట్లు కూడా ఉన్నాయి. ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

