May 1st Week Theater/Ott Releasing Movies | గతవారం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా హంగామా ఏమి కనిపించలేదు. రెండు వారాల క్రితం వచ్చిన ‘విరూపాక్ష’ తప్పితే ఈ వారం విడుదలైన రెండు సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విఫలం అయ్యాయి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘ఏజెంట్’ తొలిరోజే తుస్సుమంది. ఇక కాస్త పాజిటీవ్ తెచ్చుకున్న ‘పొన్నియన్ సెల్వన్-2’ సైతం వీక్ డేస్‌లో చాలా వీక్ అయిపోయింది. ఈ రెండు సినిమాల రోజు వారి కలెక్షన్లు కలిపిన విరూపాక్ష వసూళ్లకు దరిదాపుల్లో కూడా లేవు. ఇక ప్రేక్షకులకు కూడా విరూపాక్ష తప్పితే మరో ఆప్షన్ కనిపించడం లేదు. ఇక మే తొలి వారం మాత్రం ప్రేక్షకులకు విందు భోజనం పెట్టడానికి మంచి మంచి సినిమాలు/ వెబ్ సిరీస్‌లు ముస్తాబవుతున్నాయి. ఇక ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలేంటో ఓ లుక్కేద్ధాం.
ఉగ్రం:
చాలా కాలం తర్వాత ‘నాంది’తో అల్లరి నరేష్ మంచి కంబ్యాక్ ఇచ్చాడు. కంబ్యాక్ ఇవ్వడమే కాదు తనలోని కొత్త నటుడుని పరిచయం చేశాడు. ఈ సినిమాతో నరేష్‌కు కమర్షియల్గానూ మంచి బ్రేక్ దొరికింది. ముఖ్యంగా మార్కెట్ పెరిగింది. ఇక విజయ్ కనకమేడల దర్శకుడిగా తొలి అడుగులోనే తిరుగులేని విజయం సాధించాడు. ఈ సినిమా సక్సెస్‌తో మరోసారి వీరిద్దరూ ఉగ్రం అనే థ్రిల్లర్ సినిమా కోసం చేతులు కలిపారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు నెలకొల్పాయి.
రామబాణం:
గోపిచంద్, శ్రీవాస్ కలయికలో వస్తున్న హ్యట్రిక్ మూవీ రామబాణం. గతంలో వీళ్ల కాంబోలో తెరకెక్కిన లక్ష్యం, లౌక్యం బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టాయి. ఇక మూడో సారి వీళ్ల కాంబోలో సినిమా రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దానికి తోడు మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొల్పాయి. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా మే 5న విడుదల కానుంది.
యాద్గిరి అండ్ సన్స్:
అనిరుధ్ తూకుంట్ల, యశ్విని నివేదిత ప్రధాన పాత్రల్లో నటిచిన ఈ సినిమా మే 5న విడుదల కానుంది. భిక్షపతి రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజీవ్ కనకాల కీలకపాత్ర పోషిస్తున్నాడు. చంద్రకల పందిరి నిర్మించిన ఈ సినిమాకు విజయ్ కురకుల సంగీతం అందించాడు.
అరంగ్రేటం:
శ్రీనివాస్ ప్రబన్ నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 5న విడుదల కాబోతుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై కాస్త మంచి బజ్నే క్రియేట్ చేశాయి. సైకో థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రోషన్ షేక్, పూజ బోర, ముస్తఫా అస్కారి ప్రధాన పాత్రలు పోషించారు.
గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ:
అమెరికన్ సూపర్ హీరో ఫిలిం గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ మూడో భాగం మే 5న విడుదల కానుంది. జేమ్స్ గన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అందరిలోనూ తీవ్ర ఆసక్తి ఉంది. పైగా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్లు ఎక్కడలేని అంచనాలు నెలకొల్పాయి. క్రిష్ ప్రాట్, జో సాల్డానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో రెజ్లర్ బటిస్టా కీలకపాత్రలో నటిస్తున్నాడు.
ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు/వెబ్ సిరీస్‌లు:
ఆహా:
గీతా సుబ్రహ్మణ్యం-3 (తెలుగు సిరీస్) – మే 5
ఈటివీ విన్:
మ్యాచ్ ఫిక్సింగ్- మే 5
డిస్నీ+హాట్‌స్టార్:
సాసు బాహు ఔర్ ఫ్లెమింగో (హిందీ) – మే 5
కరోనా పేపర్స్ (మలయాళం) – మే 5
ఎడ్ షీరన్: ద సమ్ ఆఫ్ ఇట్ ఆల్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 3
రెన్నరవేషన్స్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 3
స్టార్ వార్స్: విజన్స్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) – మే 4
నెట్‌ఫ్లిక్స్:
మీటర్- మే 5
అమృతం చందమామలో(తెలుగు)-మే 5
తూ ఝూటీ మై మక్కార్(హిందీ)- మే 5
క్వీన్ షార్లెట్: ఏ బ్రిడ్జెర్టన్ స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) – మే 4
క్లిఫర్డ్: ది బిగ్ రెడ్ డాగ్ (ఇంగ్లీష్) – మే 2
ది టేర్ (ఇంగ్లీష్) – మే 2
శాంక్చురీ (మూవీ)– మే 4
ది లార్వా ఫ్యామిలీ (యామినేషన్) – మే 4
జీ5:
ఫైర్ ఫ్లైస్: పార్థ్ ఔర్ జుగ్ను (హిందీ సిరీస్) – మే 5
శెభాష్ ఫెలుడా: గ్యాంగ్ టోక్ గోండోగల్ (బెంగాలీ మూవీ) – మే 5
శెభాష్ ఫెలుడా (బెంగాలీ మూవీ) – మే 5