Matka King | బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రధాన పాత్రలో నటించిన పీరియడ్ క్రైమ్ డ్రామా ‘మట్కా కింగ్’ (Matka King). ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఏప్రిల్ 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ నుంచి తాజాగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ట్రైలర్ చూస్తుంటే.. ఈ వెబ్ సిరీస్ 1960వ దశకంలో బొంబాయిలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్లు తెలుస్తుంది. బ్రిజ్ భట్టీ (విజయ్ వర్మ) అనే ఒక సామాన్య కూలీ, కేవలం ధనవంతులకే పరిమితమైన జూదాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చి, ‘మట్కా’ అనే కొత్త సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించాడు అనేదే ఈ కథ. తన ఆశయం కోసం అతను ఎదుర్కొన్న సవాళ్లు, రాజకీయం మరియు మాఫియాతో సాగించిన పోరాటం ఇందులో చూపించబోతున్నారు మేకర్స్. ఇందులో విజయ్ వర్మతో పాటు కృతికా కమ్రా, తమ్హంకర్, సిద్ధార్థ్ జాదవ్, గుల్షన్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. సైరాట్ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు నాగరాజు మంజులే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా సిద్దార్థ్ రాయ్ కపూర్, గార్గి కులకర్ణి, అశ్విని సిద్వానీ తదితరులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.