ఓటీటీలో ‘మాస్ట్రో’?

నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’ ఓటీటీ రిలీజ్ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తొలుత ఈ నెల 11న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే కరోనా సెకండ్‌వేవ్ ప్రభావంతో విడుదల వాయిదా పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్ రిలీజ్ వాణిజ్యపరంగా లాభదాయం కాదని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ థియేటర్ రిలీజ్‌కు వెళ్లినా ప్రేక్షకులు ఏ మేరకు వస్తారో అనే సంశయాలు ఉండటంతో ఓటీటీ వైపు దృష్టిపెట్టినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ చిత్రబృందంతో సంప్రదింపులు జరుపుతోందని చెబుతున్నారు. హిందీలో విజయవంతమైన ‘అంధాధున్’ ఆధారంగా మర్డర్ మిస్టరీ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. నభానటేష్, తమన్నా కథానాయికలుగా నటించారు. శ్రేష్ట్‌మూవీస్ పతాకంపై ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

