సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మసూద’. ఈ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. హారర్ డ్రామా కథతో దర్శకుడు సాయి కిరణ్ రూపొందించారు. ఈ సినిమా నేడు రిలీజ్ అవుతున్నది. ఈ చిత్ర ప్రీమియర్ షోను యువ దర్శకులు స్వరూప్ ఆర్జే, వివేక్ ఆత్రేయ, వెంకటేష్ మహా, సందీప్ రాజ్, వినోద్ అనంతోజు తదితరులు చూసి సినిమా తమను ఆకట్టుకుందని ఈ సందర్భంగా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ…‘మా సంస్థ నుంచి మరో మంచి చిత్రాన్ని నిర్మించాం.
మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. హారర్ డ్రామాగా ఆకట్టుకుంటుంది. ప్రీమియర్ చూసిన యువ దర్శకులంతా సినిమా తమను ఆకట్టుకుందని చెప్పడం సంతోషంగా ఉంది’ అన్నారు. హారర్ చిత్రాలను తీయాలంటే సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి. తొలి చిత్రంతోనే ఆ పరిజ్ఞానాన్ని దర్శకుడు సాయి చూపించారు దర్శకుడు వివేక్ తేయ అన్నారు.