Mark Antony Movie | టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో మార్క్ ఆంథోని మూవీ.. ఆసక్తి రేకెత్తిస్తున్న టీజర్
Mark Antony Teaser | కోలీవుడ్ హీరో విశాల్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెటే ఉంది. పైగా పేరుకు తమిళ హీరో అయినా కూడా తెలుగబ్బాయి కావడంతో టాలీవుడ్ ప్రేక్షకులు విశాల్ సినిమాలను బాగానే ఆదరిస్తారు. 18ఏళ్ల క్రితం వచ్చిన ‘పందెంకోడి’ సినిమాతో విశాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు .
Mark Antony Teaser | కోలీవుడ్ హీరో విశాల్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెటే ఉంది. పైగా పేరుకు తమిళ హీరో అయినా కూడా తెలుగబ్బాయి కావడంతో టాలీవుడ్ ప్రేక్షకులు విశాల్ సినిమాలను బాగానే ఆదరిస్తారు. 18ఏళ్ల క్రితం వచ్చిన ‘పందెంకోడి’ సినిమాతో విశాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు . అప్పటి నుండి ఇప్పటివరకు ఈయన నటించిన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి. అంతేకాకుండా ఆయన సినిమాలు ఇక్కడి టైర్2 హీరో రేంజ్లో హిట్లు సాధిస్తుంటాయి. అయితే గత కొంత కాలంగా విశాల్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తేలిపోతున్నాయి.
నిజానికి ఐదేళ్ల క్రితం వచ్చిన ‘అభిమాన్యుడు’ తర్వాత ఇప్పటివరకు విశాల్‌కు మరో హిట్టు లేదు. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ ‘మార్క్ ఆంథోని’ సినిమాపైనే ఉన్నాయి. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కినట్లు టీజర్‌తోనే మేకర్స్ స్పష్టం చేశారు. చిరంజీవి ఫోన్ అని చూపిస్తూ కాలాన్ని, సమయాన్ని మార్చగలిగే ఫోన్ ఇదని టీజర్లో వెల్లడించారు. అయితే అది గ్యాంగ్‌స్టర్ మూఠాలో మేయిన్ అయిన విశాల్, ఎస్.జే సూర్యలకు ఇది దొరకకూడదని మిగితా గ్యాంగ్స్టర్లు అనుకోవడం టీజర్లో చూపించారు.విశాల్ రెండు విభిన్న గెటప్స్‌లో అదరగొట్టాడు. ముఖ్యంగా 80’ల పీరియడ్‌లో ఉన్న కాస్ట్యూమ్స్ కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి.
మొత్తంగా టీజర్‌తో సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఇప్పటికే మనం ఎన్నో సినిమాలు చేసినా.. మార్క్ ఆంటోని పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కించడం కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. పైగా కామెడీ కూడా బాగానే దట్టించినట్లు కనిపిస్తుంది. సునీల్‌కు మంచి క్యారెక్టర్ పడ్డట్లు తెలుస్తుంది. సెల్వా రాఘవన్ క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఆంటోని చచ్చి ఇరవై ఏళ్లు అవుతుందిరా. ఆ ఒక్క రోజు మీ ప్రాణాలు కాపాడుకుంటే మీరు వ్యూచర్లోకి వచ్చేస్తారు అనే డైలాగ్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. జీ.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో విశాల్‌కు జోడీగా రీతూవర్మ, అభినయలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళంతో పాటు, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రూపొందించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

