This week Telugu Movies Releasing | అన్ సీజన్‌గా చెప్పుకునే ఫిబ్రవరి, మార్చి నెలలు ఈ సారి బాక్సాఫీస్‌కు మంచి గిట్టుబాటే అయ్యాయి. ఎంత లేదన్న ఈ రెండు నెలల్లో కలిపి దాదాపు రూ.150కోట్ల వరకు బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిసాయి. చెప్పుకోదగ్గ సినిమాలేవి రిలీజ్ కాకున్న ఈ స్థాయిలో వసూళ్లు వచ్చాయంటే విశేషం అనే చెప్పాలి. అయితే ఈ రెండు నెలల్లో మాత్రం చిన్న సినిమాలే హవా చూపాయి. ‘రైటర్ పద్మభూషణ్’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’, ‘బలగం’ వంటి సినిమాలు ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టాయి. కాస్తో కూస్తో అంచనాలతో విడుదలైన ‘సార్’ మూవీ ఏకంగా తెలుగులోనే రూ. 70కోట్ల వరకు గ్రాస్‌ను కలెక్ట్ చేసి ధనుష్‌కు ఇక్కడ మంచి మార్కెట్ క్రియేట్ చేసింది. ఇక గతవారం విడుదలైన ‘దాస్ కా ధమ్కీ’ కూడా కలెక్షన్ల వేట కొనసాగిస్తుంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం లాభాల్లో ఉంది. ఇక అదే రోజున విడుదలైన ‘రంగమార్తాండ’ కూడా పర్వాలేదనిపించే కలెక్షన్లనే రాబడుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ రెండు నెలలు బాక్సాఫీస్‌కు బాగానే కలిసి వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈ వారం నాని ‘దసరా’ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఎక్కడలేని బజ్ ఏర్పడింది. కాస్త పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నా ఈ సినిమా వంద కోట్ల బొమ్మ అవడం ఖాయం. ఇక ప్రతివారం లాగానే ఈ వారం కూడా అటు థియేటర్ ఇటు ఓటీటీలో సినీ ప్రేక్షకులను కనువిందు చేయడానికి పలు సినిమాలు వెబ్‌సిరీస్‌లు ముస్తాబవుతున్నాయి. ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు/ వెబ్ సిరీస్‌లేంటో ఓ లుక్కేద్ధాం.
దసరా:
ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా స్టార్ హీరో స్టేటస్ మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు నాని. నిజానికి నాని నటించిన గత నాలుగైదు సినిమాలు కనీసం 30కోట్ల మార్కును కూడా దాటలేకపోయాయి. పైగా నాని రిస్క్‌లు గట్రా చేయకుండా ఫ్యామిలీ కథలు, లవ్ స్టోరీ మాత్రమే చేసుకుంటూ వస్తున్నాడు. దాంతో ఆడియెన్స్‌లో కూడా కొత్తగా ఏమి ట్రై చేయట్లేదు అనే భావన కలిగింది. ఈ నేపథ్యంలో నాని తన కంఫర్ట్ జానర్ నుంచి బయటకు వచ్చి దసరా వంటి అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకులు మందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై ఎక్కడలేని బజ్‌ను క్రియేట్ చేశాయి. టాక్ కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా నాని కెరీర్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా దసరా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 30 న విడుదల కానుంది.
పరారి:
గాలి యోగేశ్వర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మార్చి 30న విడుదల కానుంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాయి శివాజి దర్శకత్వం వహిస్తున్నాడు. సుమన్, రఘు, షాయాజి షిండే, అలి వంటి పలువురు అగ్ర నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
దహనం:
ఆదిత్య ఓం ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ మార్చి 31న విడుదల కానుంది. నీరు, నిప్పు, గాలితో పాటు భూత, భవిష్యత్, వర్తమానా కాలాలతో ముడిపడిన కథ ఇది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై కాస్త ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఆడారి సాయి మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా మూడు పాత్రల చుట్టూ సాగుతుందట.
వీటితో పాటుగా ‘సత్యం వధ.. ధర్మం చెర‘, ‘ఏజెంట్ నరసింహా-117‘, ‘వీర ఖడ్గం’ వంటి సినిమాలు మార్చి 31న విడుదలవుతున్నాయి.
ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు
ఆహా :
సత్తిగాని రెండెకరాలు (తెలుగు) – ఏప్రిల్ 1
అమెజాన్ ప్రైమ్ వీడియో :
ది పవర్ (వెబ్ సిరీస్) – మార్చి 31
జీ – 5 :
యునైటెడ్ కచ్చే (హిందీ) – మార్చి 31
అయోధ్య (తమిళ్) – మార్చి 31
అగిలన్ (తమిళ్) – మార్చి 31
నెట్ ఫ్లిక్స్ :
ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్ (హిందీ) – మార్చి 31
కిల్ బాక్సూన్ (కొరియన్) – మార్చి 31
మర్డర్ మిస్టరీ 2 (హాలీవుడ్) – మార్చి 31
అమిగోస్ (తెలుగు) – ఏప్రిల్ 1
షెహజాదా (హిందీ) – ఏప్రిల్ 1
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
అవతార్: ది వే ఆఫ్ వాటర్-మార్చి 28
శ్రీదేవి శోభన్ బాబు (తెలుగు) – మార్చి 30
డూగీ కామియలోహ ఎండీ (హిందీ) – మార్చి 31
గ్యాస్ లైట్ (హిందీ) – మార్చి 31
సెల్ఫీ (హిందీ) – మార్చి 31