The Silent Saviour Governor Teaser | దివాలా అంచున ఉన్న ఒక దేశం, ఊహించని యుద్ధం, కానీ ఆ దేశం కూలిపోకుండా అడ్డుకున్న ఒకే ఒక్కడు.. అతనే ‘ది సైలెంట్ సేవియర్ గవర్నర్’. అంటూ రాబోతున్నాడు ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ నుంచి చిత్రయూనిట్ తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. విపుల్ అమృత్లాల్ షా నిర్మాణంలో, చిన్మయ్ దీపక్ మాండ్లేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆర్థిక సంక్షోభం మరియు రాజకీయ చదరంగం నేపథ్యంలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగబోతున్నట్లు తెలుస్తుంది. “నేను విఫలమైతే, దేశం విఫలమైనట్లే” అనే పవర్ఫుల్ డైలాగ్‌తో సాగే ఈ చిత్రంలో అదా శర్మ, మాధూ, చిన్మయ్ దీపక్ మాండ్లేకర్ కీలక పాత్రలు పోషిస్తుండగా, అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. జావేద్ అక్తర్ సాహిత్యం సమకూర్చిన ఈ చిత్రం 2026, జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సన్‌షైన్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడే ఒక శక్తివంతమైన అధికారి పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించబోతోంది.