Sharukh khan: మన్నత్‌కి మళ్లీ పూర్వ వైభవం వచ్చిందిగా..!

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో మూడు వారాల పాటు జైలు జీవితం గడిపిన షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ జైలు నుండి బయటరు రావడంతో ‘మన్నత్’ను (Mannat) విద్యుత్ దీపాలతో అలంకరించారు. అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో షారూఖ్ ఇల్లు ముస్తాబు కాగా, ‘మన్నత్’ (Mannat) వెలుపల భారీ పోస్టర్లు పట్టుకొని బాణసంచా పేల్చారు ఫ్యాన్స్.
ఆర్యన్ ఖాన్ జైలులో ఉన్నన్ని రోజులు మన్నత్‌లో సందడే లేదు. ఇంట్లో స్వీట్స్ వంటివి కూడా చేయోద్దని గౌరీ ఖాన్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితూ ఆర్యన్ జైలు నుండి బయటకు రావడం, దీపావళి దగ్గర పడుతుండడం, మరోవైపు షారూ్ఖ్ బర్త్ డే వేడుక కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో మన్నత్ని అందంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాల కాంతులతో మన్నత్ మెరిసిపోతుంది. కాగా, షారుక్ తన 56వబర్త్ డేని గ్రాండ్‌గా చేసుకోదలచుకోవట్లేదని సమాచారం.
ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసులో ఆర్యన్‌కు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. మొత్తం 14 షరతులు విధిస్తూ ఆర్యన్‌కు (Aryan) బెయిల్ ఇచ్చింది. ఇందులో రూ.లక్ష బాండ్ ఒకటి. ఈ బాండ్‌కు ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో నటి జూహీ చావ్లా షూరిటీగా సంతకం చేశారు.
https://www.instagram.com/tv/CVvD7a9qPG-/?utm_source=ig_web_copy_link
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Aryan Khan
- mannat
- Sharukh khan
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

