Manjula hook steps | సితార తర్వాత మంజుల..కళావతి హుక్ స్టెప్స్ వీడియో హల్చల్
కళావతి పాట ఏ రేంజ్లో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పాటలో మహేశ్ బాబు (Mahesh Babu) వేసే హుక్ స్టెప్పులకు (Kalaavathi hook step) క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇప్పటికే హీరోయిన్ కీర్తిసురేశ్‌తోపాటు మహేశ్ కూతురు సితార ఈ పాటకు డ్యాన్స్ చేసి అదరహో అనిపించారు.
సర్కారు వారి పాట (Sarkaaru Vaari Paata) చిత్రం నుంచి మేకర్స్ విడుదల చేసిన కళావతి పాట ఏ రేంజ్లో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాటలో మహేశ్ బాబు (Mahesh Babu) వేసే హుక్ స్టెప్పులకు (Kalaavathi hook step) క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇప్పటికే హీరోయిన్ కీర్తిసురేశ్‌తోపాటు మహేశ్ కూతురు సితార ఈ పాటకు డ్యాన్స్ చేసి అదరహో అనిపించారు. తాజాగా మహేశ్ బాబు సోదరి, నటి మంజుల కూడా ఈ జాబితాలో చేరిపోయింది.
బ్లాక్ టీ షర్ట్, బ్లూ జీన్స్ లో ఉన్న మంజుల (Manjula Ghattamaneni) అచ్చు మహేశ్‌లాగే స్టెప్పులేసి ఔరా అనిపిస్తోంది. ఈ వీడియోన్ ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్ట్ చేయగా..ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. సుమంత్ హీరోగా నటించిన మళ్లీ మొదలైంది చిత్రంలో నటించింది మంజుల ఘట్టమనేని. తాజాగా డ్యాన్సింగ్ వీడియోను పోస్ట్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చింది. జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా సర్కారు వారి పాటను నిర్మిస్తున్నాయి.
థమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో వస్తున్న ఈ చిత్రం మే 11న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

