Mangli | సింగర్ మంగ్లీపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్.. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు
Mangli | తెలుగు ఫోక్ సింగర్ మంగ్లీపై అసభ్యకరమైన, దూషణాత్మక వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మంగ్లీ పాడిన బాయిలోనే బల్లి పలికే పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అనేక మంది ఆ పాటకు రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
Mangli | తెలుగు ఫోక్ సింగర్ మంగ్లీపై అసభ్యకరమైన, దూషణాత్మక వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మంగ్లీ పాడిన బాయిలోనే బల్లి పలికే పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అనేక మంది ఆ పాటకు రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ఒక వ్యక్తి మాత్రం ఆ పాటను ఆధారంగా తీసుకుని మంగ్లీపై అవమానకరంగా, కులదూషణకు దారితీసేలా కామెంట్లు చేస్తూ వీడియో విడుదల చేశాడు. దీనిపై ఆగ్రహించిన మంగ్లీ నేరుగా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మహిళా గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం, షెడ్యూల్డ్ తెగలను అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణలపై అతనిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం, మరియు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.
ఈ ఘటనపై స్పందించిన మంగ్లీ.. నా పాటలు ప్రజలను అలరిస్తే అది నాకు ఎంతో ఆనందం. కానీ ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు వింటే తీవ్రంగా బాధిస్తుంది. ఒక మహిళగా, ఇంకా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిగా ఇలాంటి దూషణలు నేను అస్సలు సహించలేను చట్టంపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది” అని తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరి గౌరవాన్ని దెబ్బతీసేలా కామెంట్స్ చేసినా, ముఖ్యంగా మహిళలు మరియు గిరిజన వర్గాలను లక్ష్యంగా చేసుకున్న వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
మంగ్లీ పాడిన బాయిలోనే బల్లి పలికే పాట ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్‌లోనూ ఈ సాంగ్ రికార్డులు చెరిపేస్తుంది. ఇప్పటికే పాటకు 8 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది వచ్చాయి. అయితే ఈ పాట ఎంత వైరల్ అయ్యిందో అంతే విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. కొందరు ఈ సాంగ్ లో వాడిన పదాలను కించ పరుస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగ్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

