Mangalavaram Movie | ఊరును వెంటాడుతున్న వరుస హత్యలు.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న మంగళవారం ట్రైలర్..!
Mangalavaram Movie | ఈ మధ్య కాలంలో ఒక్క టీజర్‌తో ఆడియెన్స్ అటెన్షన్‌ను గ్రాబ్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది మంగళవారం సినిమానే. ఆర్ఎక్స్100 వంటి కల్ట్ సినిమా తీసిన అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకుడు.
Mangalavaram Movie | ఈ మధ్య కాలంలో ఒక్క టీజర్‌తో ఆడియెన్స్ అటెన్షన్‌ను గ్రాబ్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది మంగళవారం సినిమానే. ఆర్ఎక్స్100 వంటి కల్ట్ సినిమా తీసిన అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకుడు. టైటిల్ పోస్టర్ నుంచి ఈ సినిమాపై జనాల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు మూడ్నెళ్ల ముందు రిలీజైన టీజర్ అంచనాలను అమాంతం పెంచేసింది. అసలు మంగళవారం ఏం జరిగిందన్న క్యూరియాసిటీ అందరిలోనూ క్రియేట్ అయింది. మహాసముద్రం వంటి అల్ట్రా డిజాస్టర్ తర్వాత అజయ్ భూపతి ఈ సారి హార్రర్ కమ్ థ్రిల్లర్ జానర్‌ను ఎంచుకుని జనాలను భయపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా నవంబర్ 17న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మేకర్స ఇప్పటినుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోతున్నారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్లో సినిమా స్టోరీ పెద్దగా రివీల్ చేయకుండా కొన్ని సీన్స్‌ను హైలైట్ చేస్తూ అజయ్ భూపతి తెలివిగా ట్రైలర్‌ను కట్ చేశాడు. అనుక్షణం భయపడుతూ బతికే ఒక ఊరి ప్రజలు.. మంగళవారం వస్తే చాలు ఆ ఊర్లో ఒక శవం లేస్తుంది. అసలు ఆ హత్యలు చేస్తుంది. అది కూడా కేవలం మంగళవారమే ఎందుకు చేస్తున్నారు. అసలా ముసుగు వేసుకుని ఊరి ప్రజలను భయపెడుతున్న మనిషి ఎవరు అనే ఎన్నో ప్రశ్నలు ట్రైలర్ లేవదీసింది. చూస్తుంటే అజయ్ భూపతి ఈ సారి సరికొత్త కంటెంట్‌తో రాబోతున్నట్లు స్పష్టమయింది.
మరీ ముఖ్యంగా కెమెరా విజువల్స్ అయితే హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. ఊరి సెటప్‌ను నేచురల్‌గా చూపించారు. ఇక అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ థ్రిల్ ఫీల్‌ను కలిగిస్తుంది. ఇప్పటివరకు ఉన్న అంచనాలు ట్రైలర్‌తో రెట్టింపయ్యాయి. సినిమాకు ఏ మాత్రం పాజిటీవ్ టాక్ వచ్చిన కలెక్షన్ల మోత మోగడం పక్కా. నందిత శ్వేత, రంగం ఫేమ్ అజ్మల్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ముద్ర మీడియా వర్క్స్, ఏ క్రియేటీవ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఆర్ఎక్స్100తో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి.. మహా సముద్రం వంటి తేలిపోయిన సినిమా చేయడం ఎవ్వరూ ఊహించలేరు. పైగా శర్వానంద్, సిద్దార్థ్ వంటి అద్భుతమైన కాస్ట్‌ను పెట్టుకుని ఆ రేంజ్ అవుట్ పుట్ ఇవ్వడం అందరినీ షాకింగ్‌కు గురి చేసింది. అయితే ఆ సినిమా ప్రభావం మంగళవారంపై ఏ మాత్రం పడలేదు. పైగా ఇప్పుడంతా థ్రిల్లర్ సినిమాలదే హావా అవడంతో మంగళవారం సినిమాపై జనాల్లో తిరుగులేని అంచనాలున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

