Vaazha 2 | నవ్వుల విందుతో వచ్చేస్తున్న మలయాళ బ్లాక్ బస్టర్ ‘వాళ 2’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!
Vaazha 2 | గత ఏడాది మలయాళంలో సూపర్ హిట్ అయిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'వాళ' (Vaazha) చిత్రానికి సీక్వెల్గా వస్తున్న చిత్రం 'వాళ 2' (Vaazha 2: Biopic of Billion Bros).
Vaazha 2 | గత ఏడాది మలయాళంలో సూపర్ హిట్ అయిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘వాళ’ (Vaazha) చిత్రానికి సీక్వెల్గా వస్తున్న చిత్రం ‘వాళ 2’ (Vaazha 2: Biopic of Billion Bros). ఈ చిత్రం సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. హ్యూమర్, ఎమోషన్స్ మరియు ఫ్రెండ్షిప్ కలబోతగా కట్ చేసిన ఈ ట్రైలర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సరికొత్త కథనంతో వస్తున్న ఈ సీక్వెల్ ట్రైలర్లో ప్రముఖ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రెన్ (ప్రేమమ్ ఫేమ్) పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి సర్ప్రైజ్ చేశారు. అంతేకాకుండా ఆయన దర్శకత్వం వహించిన క్లాసిక్ మూవీ ‘ప్రేమమ్’పై వచ్చే కొన్ని ఫన్నీ డైలాగులు ట్రైలర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి విపిన్ దాస్ రచన అందించగా, సావిన్ ఎస్.ఏ. దర్శకత్వం వహించారు. ఇందులో హాషిర్, అజిన్ జాయ్, వినాయక్, అల్ఫోన్స్ పుత్రెన్, సుధీష్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా, అంకిత్ మీనన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మొదటి భాగంలాగే ఈ సీక్వెల్ కూడా యువతను పెద్ద ఎత్తున అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

