Garudan Movie | ఓటీటీలోకి వచ్చేసిన మలయాళీ బ్లాక్ బస్టర్ ‘గరుడన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
Garudan Trailer | ‘ఖతర్నాక్’, ‘రణం’ చిత్రాలతో తెలుగువారికి పరిచయమైన మలయాళ నటుడు బిజుమీనన్ (Biju Menon). ఇక లాక్డౌన్లో వచ్చిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాతో తెలుగులో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమాతోనే బిజు పేరు దక్షిణాదిన మారు మోగిపోయింది.
Garudan Trailer | ‘ఖతర్నాక్’, ‘రణం’ చిత్రాలతో తెలుగువారికి పరిచయమైన మలయాళ నటుడు బిజుమీనన్ (Biju Menon). ఇక లాక్డౌన్లో వచ్చిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాతో తెలుగులో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమాతోనే బిజు పేరు దక్షిణాదిన మారు మోగిపోయింది. ఇదే సినిమాను తెలుగులో భీమ్ల నాయక్ (Bheemla Nayak) పేరుతో రీమేక్ చేయగా మంచి విజయం సాధించింది. ఇదిలా ఉంటే బిజుమీనన్ (Biju Menon), సురేష్ గోపి (Suresh Gopi) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘గరుడన్'(Garudan). అరుణ్ వర్మ(Arun Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీళ్లిద్దరూ (బిజుమీనన్, సురేష్ గోపి ) కలిసి నటించగా నవంబర్ 3న థియేటర్లలోకి ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్నిమేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ చిత్రంలో సిద్ధిక్, దిలీష్ పోతన్, మేజర్ రవి, తలైవాసల్ విజయ్, అర్జున్ నందకుమార్, దివ్య పిళ్లై, సంతోష్ కీశతుర్, బాలాజీ శర్మ, మాళవిక, రంజిత్ కంగోల్, జేసీ జోస్, జోసుకుట్టి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమా కథలోకి వెళితే.. న్యాయం కోసం పోరాడే ఓ పోలీస్ ఆఫీసర్, జైలు నుంచి విడుదలైన ఓ కాలేజీ ప్రొఫెసర్ వారి జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో కేరళ ఆర్మ్డ్ పోలీస్ కమాండెంట్ పాత్రలో సురేష్ గోపి నటించగా.. కాలేజీ ప్రొఫెసర్‌గా బిజు మీనన్ నటించారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్‌పై లిస్టిన్ స్టీఫెన్ ఈ సినిమాను నిర్మించగా.. జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.
Malayalam film #Garudan (2023) by #ArunVarma, ft. #SureshGopi #BijuMenon #Siddique #Jagadish #ThalaivasalVijay #DileeshPothan #Abhirami #DivyaPillai & #KalabhavanHaneef, now streaming on @PrimeVideoIN.#ListinStephen @JxBe @magicframes2011 @APIfilms pic.twitter.com/uXN8lsjueg
— CinemaRare (@CinemaRareIN) December 1, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

