అదో గొప్ప సృజనాత్మక అనుభవం
గడిచిన నెలంతా తనకు మిశ్రమానుభూతుల్ని అందించిందంటూ సోషల్ మీడియా వేదికగా గత నెల అనుభవాలను నెమరువేసుకున్నది మలయాళ మందారం మాళవిక మోహనన్.
గడిచిన నెలంతా తనకు మిశ్రమానుభూతుల్ని అందించిందంటూ సోషల్ మీడియా వేదికగా గత నెల అనుభవాలను నెమరువేసుకున్నది మలయాళ మందారం మాళవిక మోహనన్. ‘త్యాగరాజన్ కుమారరాజ దర్శకత్వంలో నేను నటిస్తున్న ‘పాకెట్ నవల్’ సినిమా షూటింగ్ గత నెలలోనే మొదలైంది. కోలీవుడ్‌లోని అత్యుత్తమ దర్శకుల్లో త్యాగరాజన్ ఒకరని నిస్సందేహంగా చెప్పగలను.
ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్ డీలక్స్’ చిత్రమంటే నాకెంతో ఇష్టం. ఇప్పుడు ఆయనతోనే పనిచేస్తున్నాను. ఆయన మార్గదర్శకత్వంలో నటిగా నన్ను నేను మలచుకోవడం ఓ గొప్ప సృజనాత్మక అనుభవం. అలాగే.. షూటింగ్లో భాగంగా నెల రోజుల పాటు చెన్నైలోనే ఉన్నా. అంతకాలం ఇంటికి దూరంగా ఉండటం భారంగా అనిపించింది.
రోజంతా షూట్లో పాల్గొని, రూమ్‌కి వెళితే ఒక్కదాన్నే లోన్లీగా ఫీలయ్యేదాన్ని. అప్పడప్పుడు నాకోసం ఇంట్లోవాళ్లు వచ్చేవారు. అప్పుడు మాత్రం రిలీఫ్ అనిపించేది. షూటింగ్ పుణ్యమా అని మహాబలిపురం దేవాలయాలను సందర్శించా. తమిళనాడు ఫుడ్‌ని ఇష్టంగా ఆరగించా. కొన్ని రోజుల క్రితమే ముంబైలోని మా ఇంటికి చేరా’ అంటూ రాసుకొచ్చింది మాళవిక మోహనన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

