Takkar | సిద్దార్థ్ (Siddharth), దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik) కాంబినేషన్లో వస్తున్న చిత్రం టక్కర్ (Takkar). రొమాంటిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని కార్తీక్ జీ క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. జూన్ 9న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో చిట్ చాట్ చేశాడు సిద్దార్థ్. టక్కర్ సినిమా విశేషాలు సిద్దార్థ్ మాటల్లోనే..
సినిమా ఎలా ఉండబోతుంది..?
ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఘర్షణ నేపథ్యంలో సినిమా ఉండబోతుంది. దీంతోపాటు హీరోహీరోయిన్, హీరో అండ్ విలన్ మధ్య జరిగే సంఘర్షణ, ఈగో, జెండర్, మనీ, పరిస్థితులు.. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే కసితో ఉన్న హీరోను కిడ్నాపర్‌గా మారుస్తాయి.
తెలుగు ఇండస్ట్రీకి తిరిగి రావడం ఎలా అనిపిస్తుంది..?
ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎస్ఎస్ రాజమౌళి ఒక బ్రాండ్. సినిమాలపై తెలుగు ప్రేక్షకులు చాలా ప్రేమ చూపిస్తారు. గతంలో తెలుగు సినిమాలు చేయకపోవడంపై ప్రశ్నించగా.. భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాను చేస్తానని చెప్పాను.
ప్రేమకథలతో విసిగిపోయారా..?
ప్రేమకథలు యాక్టర్ల నుంచి చాలా డిమాండ్ చేస్తాయి. యాక్టర్లు కూడా అలిసిపోతారు. ఒక నటుడు ప్రేమకథలు చేస్తే.. ప్రేమకథ సినిమాలను మాత్రమే కొనసాగించాలనే భావన పరిశ్రమలో ఉంది. ప్రేమకథల పరిధిలో ఉన్నప్పుడు కూడా కొందరు భవిష్యత్ కథనాలను ప్రభావితం చేసే ప్రమాణాలను సెట్ చేశారు. ఒకవేళ నేను సక్సెస్ఫుల్ లవ్ స్టోరీలో నటిస్తే.. రాబోయే దశాబ్దం వరకు ఆ చట్రంలోనే ఉండిపోయే ప్రమాదం ఉంది.
టక్కర్‌లో మీ డిఫరెంట్ లుక్ గురించి..
డైరెక్టర్ కార్తీక్ క్రిష్ కు డిఫరెంట్ షేడ్స్‌లోకి మార్చే అసాధారణ ప్రతిభ ఉంది. టక్కర్ చిత్రంలో నా కొత్త లుక్ ప్రత్యేకమైన ఉద్దేశంతో డిజైన్ చేయబడ్డది. సినిమాలో ఓ సన్నివేశం నా లుక్‌ను సమర్థిస్తుంది. నేను నటుడిగా సిద్ధార్థ్ వ్యక్తిత్వాన్ని అధిగమించి విభిన్నమైన పాత్రలో నటించగలిగాను.
బొమ్మరిల్లు 2 చేస్తారా..?
బొమ్మరిల్లు నా హృదయానికి దగ్గరైన సినిమా. కేవలం ఓ సినిమాగా కాకుండా అంతకంటే ఎక్కువ స్థాయిలో చూస్తారు. బొమ్మరిల్లులో భావోద్వేగాలను పండించే తీరు కూర్చలేనిది. దీనికి సీక్వెల్ చేయడం చాలా పెద్ద టాస్క్. ఆ మ్యాజిక్‌ను మళ్లీ సృష్టించాలంటే చాలా సవాలుతో కూడిన విషయం.
మీ కొత్త సినిమాల గురించి..
టక్కర్ తర్వాత చిన్నా సినిమా చేస్తున్నా. నా హోంబ్యానర్లో తెరకెక్కిస్తున్నా. ఇండియన్ 2లో భాగమవ్వడం థ్రిల్లింగ్‌గా ఉంది. టెస్ట్ టైటిల్‌తో వస్తున్న సినిమాలో మాధవన్, నయనతారతో కలిసి నటిస్తున్నా. కార్తీక్ జీ క్రిష్‌తో మరో సినిమా చేయడం ఎక్జయిటింగ్‌గా ఉంది. నేను వైవిధ్యమైన సినిమాలు చేయాలనుకుంటున్నా.
Expectation vs Reality..
ఊపిరే లిరికల్ వీడియో సాంగ్..
కయ్యాలే వీడియో సాంగ్..
టక్కర్ టీజర్..