K.G.F Chapter-3 | ‘కేజీఎఫ్ చాప్టర్-3’ ఉండనుందా.. బిగ్ హింట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్?
ఇన్ని రోజులు 'ఆర్ఆర్ఆర్' హవా నడిచింది. ఇప్పుడే 'కేజీఎఫ్' హవా మొదలైంది. సౌత్ నుంచి నార్త్ వరకు ఎక్కడ చూసిన 'కేజీఎఫ్' జాతర నెలకొంది. ఎప్పుడెప్పుడు సీక్వెల్‌ను చూద్ధామా అని ప్రేక్షకుల నాలుగేళ్ళ ఎదురు చూపులకు గురువారం తెరపడింది.
K.G.F Chapter-3 | ఇన్ని రోజులు ‘ఆర్ఆర్ఆర్’ హవా నడిచింది. ఇప్పుడే ‘కేజీఎఫ్’ హవా మొదలైంది. సౌత్ నుంచి నార్త్ వరకు ఎక్కడ చూసిన ‘కేజీఎఫ్’ జాతర నెలకొంది. ఎప్పుడెప్పుడు సీక్వెల్‌ను చూద్ధామా అని ప్రేక్షకుల నాలుగేళ్ళ ఎదురు చూపులకు గురువారం తెరపడింది. భారీ అంచనాలతో వచ్చిన ప్రేక్షకులను ఇసుమంత నిరాశను కూడా చెందించకుండా ప్రశాంత్‌నీల్ సీక్వెల్‌ను అద్భుతంగా తెరకెక్కించాడు. యష్ నటన, ఆటిట్యూడ్‌కు ప్రేక్షకులు మరో సారి ఫిదా అవుతున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం కేవలం ప్రీ బుకింగ్స్‌తోనే దాదాపు 60కోట్ల వరకు కలెక్షన్లను సాధించింది. ఇదిలా ఉంటే కేజీఎఫ్ సిరీస్‌కి చాప్టర్-2 ఎండింగ్ కాదు అని తెలుస్తుంది.
అయితే చాప్టర్-2 క్లైమాక్స్‌లో కేజీఎఫ్ మూడో భాగం కూడా ఉండబోతున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు. మూడో భాగంలో యష్ ఇంటర్నేషనల్ లెవల్లో పవర్ చూపెట్టబోతున్నాడు. సముద్రంలో హీరో వస్తుంటే అతడి షిప్‌ను రెండు దేశాల అధికారులు వెంబడిస్తారు. ఈ మూడో భాగంలో రాఖీభాయ్ సామ్రాజ్యం ఇంటర్ నేషనల్ లెవల్లో విస్తరించబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా విడుదలైన చాప్టర్-2 గురించి అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. చాప్టర్-1కు ఏమాత్రం తీసిపోకుండా చాప్టర్-2 ఉందని ప్రేక్షకులు వెల్లడిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

