Sarkaru Vaari Paata Movie | ఆ రెండు థియేటర్లలో వంద రోజులు పూర్తి చేసుకున్న ‘సర్కారు వారి పాట’
Sarkaru Vaari Paata Movie Completes 100 days | ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత దాదాపు రెండున్నరేళ్ళకు మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆకలితో ఉన్న అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ పెట్టింది. ఈ చిత్రంలో మహేష్‌బాబు క్యారెక్టరైజేషన్, ఎనర్జీ గత చిత్రాలకు భిన్నంగా ఉంది. భారీ అంచనాలతో మే 12న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించింది. మహేష్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సర్కారు వారి పాట నిలిచింది. అయితే ‘ఎఫ్3’, ‘మేజర్’, ‘విక్రమ్’ వంటి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలవడంతో ‘సర్కారు వారి పాట’ స్పీడుకు బ్రేకులు పడ్డాయి. దాంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోలేకపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది.
‘సర్కారువారి పాట’ చిత్రం తాజాగా వంద రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేట కృష్ణమహల్ డీలక్స్, గోపాలపట్నంలోని మౌర్య థియేటర్లలో సర్కారు వారి పాట చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. సముద్రఖని ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. 14రీల్స్ ఎంటర్టైనమెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లతో కలిసి మహేష్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
100 DAYS for the Sensational Blockbuster #SarkaruVaariPaata 🔥
Super🌟 @urstrulyMahesh at his absolute best on the Big Screens ❤️🔥#100DaysOfBlockbusterSVP@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus pic.twitter.com/Dh64HXNUKu
— BA Raju's Team (@baraju_SuperHit) August 19, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

