MaheshBabu | రాజమౌళి-మహేష్‌బాబు చిత్రం ప్రారంభమయ్యేది.. విడుదలయ్యేది అప్పుడేనట?
మహేష్‌బాబు-రాజమౌళి ప్రాజెక్ట్‌పై మహేష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వీళ్ల కాంబోలో సినిమా ఎప్పుడు సెట్టవుతుందా అని అభిమానులు తెగ ఆరటపడేవారు.
MaheshBabu-Rajamouli Movie |మహేష్‌బాబు-రాజమౌళి ప్రాజెక్ట్‌పై మహేష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వీళ్ల కాంబోలో సినిమా ఎప్పుడు సెట్టవుతుందా అని అభిమానులు తెగ ఆరటపడేవారు. ఆ నిరీక్షణకు ఫలితంగా మహేష్‌బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఫారెస్ట్ అడ్వేంచర్‌గా ఈ చిత్ర కథను విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేశాడని సమాచారం. గతంలోనే వీటి గురించి ప్రకటన వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త బయటకు రాలేదు. జక్కన్న రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’తో బిజీగా ఉండగా మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’తో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ ఏడాది ద్వితీయార్థంలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ చిత్రాన్ని 2024 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కించిన ‘ట్రిపుల్ ఆర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మహేష్‌బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ‘గీతాగోవిందం’ ఫేం పరుశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మే12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

