Sitara Ghattamaneni | హీరోయిన్ల రేంజ్లో సితార పారితోషికం.. జ్యూవెల్లరీ యాడ్ కోసం కళ్లు చెదిరే రెమ్యునరేషన్
Maheshbabu Daughter | సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితారకు సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ ఉంది. సితారకు సంబంధించిన పలు డ్యాన్స్ వీడియోలు మహేష్ భార్య నమ్రత తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
Maheshbabu Daughter | సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితారకు సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ ఉంది. సితారకు సంబంధించిన పలు డ్యాన్స్ వీడియోలు మహేష్ భార్య నమ్రత తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. సినిమా పాటలే కాకుండా కూచిపూడి వంటి క్లాసికల్ డ్యాన్స్‌లు కూడా సితార చేస్తుంటుంది. వీటికి సంబంధించిన వీడియోలు క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి. అంతేకాకుండా సితార ఓ యూట్యూబ్ చానెల్ కూడా రన్ చేస్తుంది. ఇలా చిన్నతనంలోనే తండ్రికి తగ్గ తనయికగా పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇక ఈ మధ్య మహేష్‌తో కలిసి పలు షోలకు అటెండ్ అవుతూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది.
ఇటివలే సితార ప్రముఖ నగల తయారీ సంస్థ పీఎంజే జ్యూవెల్స్‌కు సంబంధించిన యాడ్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శితమయ్యాయి. ప్రత్యేకంగా సితార కలెక్షన్ పేరుతో ఆ జ్యూవెల్లరీ సంస్థ ఓ స్పెషల్ బ్రాండ్‌ని సృష్టించి ఆమెతో యాడ్ షూట్ చేశారు. ఆ ఫోటోలు చూసి మహేష్‌బాబు మురిసిపోయాడు. ఇక ఈ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం ద్వారా సితార అక్షరాల కోటీ రూపాయల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇంత చిన్న వయసులో తొలి యాడ్‌కు ఆ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకోవడం మాములు విషయం కాదని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఇక మహేష్ సైతం సినిమాలకంటే యాడ్స్ ద్వారానే ఎక్కువ అర్జిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ గుంటూరు కారంతో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ సినిమాపై తిరుగులేని అంచనాలు క్రియేట్ చేసింది. సంక్రాంతిని టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమాను హరికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

