Mahesh | కమెడియన్ మహేష్ ఎమోషనల్ వీడియో.. ‘లైఫ్ అన్‌ప్రెడిక్టబుల్’ అంటూ షాకింగ్ కామెంట్స్
Mahesh | టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ మహేష్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో అభిమానుల్లో ఆందోళనకు గురిచేసింది. ఎప్పుడూ నవ్విస్తూ కనిపించే మహేష్ ఈసారి ఎంతో భావోద్వేగంగా మాట్లాడడంతో అసలు ఏం జరిగిందనే చర్చ మొదలైంది.
Mahesh | టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ మహేష్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో అభిమానుల్లో ఆందోళనకు గురిచేసింది. ఎప్పుడూ నవ్విస్తూ కనిపించే మహేష్ ఈసారి ఎంతో భావోద్వేగంగా మాట్లాడడంతో అసలు ఏం జరిగిందనే చర్చ మొదలైంది.ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి క్యాప్షన్ లేకుండా పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియోలో మహేష్ మాట్లాడుతూ, “లైఫ్ చాలా అన్‌ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. బయట కనిపించే విషయాలను బట్టి ఊహించుకుని నమ్మేయడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా రిపోర్టర్లు, మీమర్స్ నేను నిజం చెప్పే వరకు ఏమీ రాయొద్దు. త్వరలోనే మొత్తం విషయం చెబుతాను” అని పేర్కొన్నారు.
మహేష్ ఈ వీడియోలో చాలా బాధగా కనిపించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమైంది అన్నా? , మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి , మేమంతా మీకు అండగా ఉంటాం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు ఇది ఏదైనా సినిమా ప్రమోషన్లో భాగమా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల మహేష్ నటించిన ‘సింగ్ గీతం’ చిత్రం తమిళంలో విడుదలైనట్లు ఆయన తన సోషల్ మీడియా స్టోరీలో పోస్ట్ చేశారు.
అయితే మహేష్ జీవితంలో నిజంగానే ఏదైనా సంఘటన జరిగిందా? లేక కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రచారంలో భాగంగా ఈ వీడియోను విడుదల చేశారా? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే పూర్తి నిజం వెల్లడిస్తానని మహేష్ చెప్పడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక మహేష్ విషయానికి వస్తే ఒకప్పుడు జబర్ధస్త్ కమెడీయన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రామ్ చరణ్ రంగస్థలం చిత్రంలో కీలక పాత్ర పోషించి ఆకట్టుకున్నాడు. ఇక అప్పటి నుండి మనోడికి మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం కెరీర్లో బిజీగానే ఉంటున్నాడు మహేష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

