Mahesh Babu | వర్సటైల్ నటుడు సత్యదేవ్, దర్శకుడు వెంకటేష్ మహా కాంబినేషన్లో తెరకెక్కుతున్న సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’పై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ప్రశంసలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న మహేష్ బాబు, సినిమా ఫైనల్ కట్‌ను వీక్షించిన అనంతరం తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘రావు బహదూర్’ కేవలం కళ్లతో చూసే సినిమా కాదని, గుండెతో అనుభూతి చెందాల్సిన చిత్రమని ఆయన పేర్కొన్నారు. సినిమా తనను ఎంతగానో కదిలించిందని వెల్లడించారు.
‘రావు బహదూర్’ ఒక అందమైన, విభిన్నమైన, అద్భుతమైన డ్రామా అని కొనియాడారు. దర్శకుడు వెంకటేష్ మహా తన విజన్‌తో తెరపై ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడని, ఆ ప్రపంచంలోకి ప్రేక్షకులను పూర్తిగా తీసుకెళ్లగలిగాడని ప్రశంసించారు. హీరో సత్యదేవ్ నటనపై కూడా మహేష్ ప్రత్యేకంగా స్పందించారు. పాత్రలో పూర్తిగా లీనమై సత్యదేవ్ తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకదాన్ని అందించాడని పేర్కొన్నారు. అతని నటన ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇక హీరోయిన్ దీపా థామస్ కూడా ఎంతో పరిణతితో కూడిన నటనను కనబరిచిందని మహేష్ ప్రశంసించారు. సాంకేతిక నిపుణుల పనితనం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని, చిత్ర యూనిట్ మొత్తం ఎంతో అంకితభావంతో పని చేసిందని తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ తనకు ఎంతో ప్రత్యేకమని చెబుతూ, చిత్ర బృందం చేసిన కృషిని చూసి తాను గర్వపడుతున్నట్లు మహేష్ వెల్లడించారు. ప్రేక్షకులు ఈ కొత్త తరహా అనుభూతిని థియేటర్లలో తప్పకుండా ఆస్వాదిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘రావు బహదూర్’పై మహేష్ బాబు ఇచ్చిన ఈ ఎమోషనల్ రివ్యూ సినిమాకు మరింత హైప్‌ను తీసుకొచ్చింది. ఒక స్టార్ హీరో స్వయంగా ఓ చిన్న చిత్రానికి అండగా నిలవడమే కాకుండా, ఇంతగా ప్రశంసించడం చిత్రబృందానికి పెద్ద బలంగా మారింది. ఇప్పుడు మహేష్ బాబు మాటలతో ‘రావు బహదూర్’పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. మరి ఈ సైకలాజికల్ డ్రామా జూలై 3న ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.