Mahesh Babu | ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లకు బ్రదర్ .. ‘లిటిల్ హార్ట్స్’ మూవీపై మహేష్ బాబు రివ్యూ
Mahesh Babu | కేవలం రూ.2.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన లిటిల్ హార్ట్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మూవీ రిలీజ్ అయిన 10 రోజుల్లోనే రూ.32 కోట్లకు పైగా వసూలు చేస్తూ చిన్న సినిమాలకు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది.
Mahesh Babu | కేవలం రూ.2.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన లిటిల్ హార్ట్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మూవీ రిలీజ్ అయిన 10 రోజుల్లోనే రూ.32 కోట్లకు పైగా వసూలు చేస్తూ చిన్న సినిమాలకు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. రెండో వారంలో కూడా డీసెంట్ కలెక్షన్స్‌తో రన్ అవుతూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.సినిమా విజయాన్ని చూసి సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, రవితేజ, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, నాని, సుమంత్, అడివి శేష్ ఇలా పలువురు హీరోలు ఈ సినిమాపై సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన రివ్యూ ఇవ్వడంతో మూవీ టీమ్ ఆనందంలో మునిగిపోయింది.
ఇక ఈ సినిమాకి సంగీతం అందించిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ ఎర్రమల్లి, మహేష్ బాబుకు డై హార్డ్ ఫ్యాన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నా డెమి గాడ్ మహేష్ అన్న ఒకసారి మా సినిమాపై ట్వీట్ చేస్తే చాలు.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఒక వారం ఎక్కడికైనా వెళ్లిపోతా. అంతకుమించిన ఆనందం నా జీవితంలో ఉండదు అని చెప్పాడు. ఈ మాటలు మహేష్ వరకూ చేరడంతో ఆయన తన అభిమానిని నిరాశపరచకుండా లిటిల్ హార్ట్స్ పై రివ్యూ పోస్ట్ చేశారు. లిటిల్ హార్ట్స్ సినిమా చాలా సరదాగా, కొత్తగా, అద్భుతంగా ఉంది. నటీనటులందరూ ఎక్స్ట్రార్డినరీగా చేశారు.
ముఖ్యంగా యంగ్ స్టర్స్ అద్భుతంగా నటించారు. సింజిత్, ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లకు బ్రదర్. నీకు ముందు చాలా బిజీ రోజులు వస్తాయి. రాకింగ్ చేస్తూ ఉండాలి. మొత్తం టీంకి నా అభినందనలు అంటూ మహేష్ తన రివ్యూను పంచుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా తన పోస్టులో లవ్ ఎమోజీలు, స్మైలీలు జోడించడం ప్రత్యేకత. మహేష్ రివ్యూ చూసి సింజిత్ ఆనందంతో గాల్లో ఎగురుతున్నాడు. నేను ఎక్కడికీ వెళ్లను మహేష్ అన్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు మహేష్ గుంటూరు కారం మూవీలో చేసిన డ్యాన్స్‌పై కాత్యాయని పాటను ఎడిట్ చేసి వీడియో షేర్ చేశాడు. డైరెక్టర్ సాయి మార్తాండ్ కూడా మహేష్ బాబుకు వీరాభిమాని. ఆయన, “థ్యాంక్స్ సార్. ఇది ఊహించిన దాని కంటే చాలా ఎక్కువ” అని ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యాడు. ఇలా టీమ్ అంతా కూడా మహేష్ బాబు ట్వీట్‌కి ఆనందం వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

