వివరాలు తెలిపేది అప్పుడే..
చేయబోయే సినిమా గురించి ముందుగానే ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడటం రాజమౌళి స్టయిల్. మహేశ్‌బాబుతో సినిమా అనుకున్నప్పట్నుంచీ ఈ సినిమా గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తూనేవున్నాయి.
చేయబోయే సినిమా గురించి ముందుగానే ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడటం రాజమౌళి స్టయిల్. మహేశ్‌బాబుతో సినిమా అనుకున్నప్పట్నుంచీ ఈ సినిమా గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తూనేవున్నాయి. వాటితోపాటు రాజమౌళీ, విజయేంద్రప్రసాద్, కార్తికేయ లాంటి వాళ్లు వేడుకల్లో చిన్న చిన్న లీకులిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతూనేవున్నారు. అయితే.. అసలైన సమాచారం ఎప్పుడొస్తుంది?. రాజమౌళి ఎప్పుడు ప్రెస్‌మీట్ పెట్టబోతున్నారు? అనే ప్రశ్నలు మాత్రం ప్రేక్షకుల్లో లేకపోలేదు. నిజానికి ఏప్రిల్ 9న ఉగాది సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన తొలి ప్రెస్‌మీట్‌ని రాజమౌళి నిర్వహించనున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. అయితే.. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఉగాదికి ప్రెస్‌మీట్ పెట్టడంలేదట. మహేశ్‌బాబు పుట్టినరోజైన ఆగస్ట్ 9న ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారట. ఆ రోజునే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ని కూడా విడుదల చేయనున్నట్టు సన్నిహిత వర్గాల సమాచారం. ట్రెజర్ హంట్ కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే మొదలైంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో పాన్ వరల్డ్ స్థాయి సినిమాగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

