Sitara Ghattamaneni | టాలీవుడ్ స్టార్ నటుడు మహేశ్‌బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అటు సినిమాలు, ఇటు బిజినెస్‌లు అంటూ ఎప్పుడూ బిజీగా గడుపుతుంటారు. సోషల్ మీడియాకు మహేశ్ ఎప్పుడూ దూరంగా ఉంటారు. దొరికిన సమయాన్ని పిల్లలు, కుటుంబ సభ్యులతో గడిపేందుకే కేటాయిస్తుంటారు. ఇక మహేశ్ గారాల పట్టి సితార మాత్రం నెట్టింట తెగ సందడి చేస్తుంటుంది. డ్యాన్స్, ఇతర యాక్టివిటీలతో అందరినీ ఆకర్షిస్తుంటుంది. తాజాగా సితార.. మహేశ్‌బాబు నటించిన చిత్రంలోని పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది.
మహేశ్ నటించిన ‘అతడు’ చిత్రంలోని ‘పిల్లగాలి అల్లరి..’ పాటకు చక్కటి హావభావాలతో స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను మహేశ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సితార ప్రతిభను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘నెమలిలా నాట్యం చేస్తోంది..’, ‘సూపర్ డ్యాన్స్..’, ‘చాలా చక్కగా డ్యాన్స్ చేస్తోంది’, ‘మహేశ్ బాబులాగా తను కూడా చాలా టాలెంటెడ్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం సితార అందమైన డ్యాన్స్‌ను మీరూ చూసేయండి.