Mahesh Babu | కొత్త ఏడాది మహేశ్ మరో ముందడుగు.. చిన్నారుల కోసం వెబ్సైట్ ప్రారంభం
కొత్త ఏడాది ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ తన సందేశాన్ని ట్విట్టర్లో వెలువరించింది. ఈ నెల తన పాకెట్ మనీని మహేశ్ బాబు ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది. మీరు కూడా మీ వంతు సాయం చేయండి అంటూ విజ్ఞప్తి చేసింది. మనందరం కలిసి పిల్లల కోసం మరింత మెరుగైన ప్రపంచాన్ని సృష్టిద్దాం అని పేర్కొంది.
Mahesh Babu | టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ హీరోనే. వరుస సినిమాలు, కుటుంబంతో బిజీగా ఉండే ఆయన.. మరోవైపు సామాజిక సేవ చేస్తున్నారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న ఎందరో చిన్నారులకు తన వంతు సాయం చూస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో ఇప్పటికే వందలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వారి కుటుంబాల్లో ఆనందం నింపారు. అంతేకాకుండా తన తండ్రి స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకుని నిజమైన శ్రీమంతుడు అనిపించుకున్నారు. దత్తత గ్రామాల్లో వైద్య సదుపాయాలు, బడులు, రోడ్లు వంటివి చేసి గ్రామాల రూపురేఖలనే మార్చేస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే మహేశ్.. ప్రచారానికి మాత్రం దూరంగా ఉంటారు.
కొత్త ఏడాది సందర్భంగా మహేశ్ మరో అడుగు ముందుకేశారు. తన సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మహేశ్ బాబు ఫౌండేషన్ డాట్ ఆర్గ్ (http://maheshbabufoundation.org) పేరుతో ఈ వెబ్‌సైట్‌ను తీసుకువచ్చారు. పిల్లల కోసం నూతన సంవత్సరాది రోజున ఈ వెబ్సైట్ ప్రారంభిస్తున్నట్టు మహేశ్ ముద్దుల తనయ సితార ఘట్టమనేని వెల్లడించింది. కొత్త ఏడాది ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ తన సందేశాన్ని ట్విట్టర్లో వెలువరించింది. ఈ నెల తన పాకెట్ మనీని మహేశ్ బాబు ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది. మీరు కూడా మీ వంతు సాయం చేయండి అంటూ విజ్ఞప్తి చేసింది. మనందరం కలిసి పిల్లల కోసం మరింత మెరుగైన ప్రపంచాన్ని సృష్టిద్దాం అని పేర్కొంది.
In our endeavour to create a world where children survive and thrive, we are happy to be launching our official website this New Year! https://t.co/jY6B4gXMPd
For the children…to the children ❤️#MBFoundation wishes you all a happy new year 2023!@urstrulymahesh pic.twitter.com/MdOhnee1sr
— Mahesh Babu Foundation (@MBfoundationorg) January 1, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

