Mahesh Babu | మహేశ్.. నీకోసం ప్రపంచం ఎదురుచూస్తోంది!
తెలుగు సినిమాకోసం ప్రపంచం ఎదురుచూసేలా చేసిన దర్శకుడు రాజమౌళి. ఆయన సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో చేయనున్న సినిమాకోసం ప్రపంచమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.
Mahesh Babu | తెలుగు సినిమాకోసం ప్రపంచం ఎదురుచూసేలా చేసిన దర్శకుడు రాజమౌళి. ఆయన సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో చేయనున్న సినిమాకోసం ప్రపంచమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. రచయిత విజయేంద్రప్రసాద్ పలు వేదికలపై ఈ సినిమా గురించి కొత్త కొత్త అప్డేట్లు ఇస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపులు చేస్తున్నారు.
అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో ట్రజర్ హంట్ కథాంశంతో దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ అడ్వంచరస్ డ్రామా గురించి ఇప్పుడిప్పుడే కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ సినిమాకోసం మహేశ్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకునే పనిలోవున్నారు. రాత్రింబవళ్లూ జిమ్ములోనే గడుపుతూ ఊహించని విధంగా మేకోవర్ అవుతున్నారు. తాజాగా తెలుస్తున్న వార్తేంటంటే.. ఇందులో మహేశ్ పూర్తి గడ్డంతో కనిపిస్తారట. అందుకోసం స్టయిల్‌గా గడ్డంపెంచే పనిలో ఉన్నారు సూపర్‌స్టార్.
హాలీవుడ్ ట్రజర్ హంట్ చిత్రాలను తలదన్నేలా ఈ సినిమాను దర్శకధీరుడు తెరకెక్కించనున్నట్టు యూనిట్‌వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. కథతోపాటు మాటలు కూడా విజేంద్రప్రసాదే అందిస్తున్నట్టు తెలిసింది. తెలుగు చలనచిత్ర చరిత్రలో సూపర్‌స్టార్ కృష్ణ నటించినన్ని ట్రజంర్ హంట్ కథలు ఏహీరో నటించలేదన్నది నిజం. ఇప్పుడు తండ్రి బాటలోనే మహేశ్ కూడా ట్రజర్ హంట్ కథతోరానున్నారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

