MAA Oath | విష్ణు హామీలన్నీ నెరవేర్చుతాడు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు శనివారం హైదరాబాద్‌లో ప్రమాణస్వీకారం చేశారు. రానున్న రెండేళ్లలో 24 క్రాప్ట్స్ సహకారంతో ‘మా’ను అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. తాము చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి ప్రకాష్‌రాజ్ ప్యానల్ సలహాలు తీసుకుంటామని విష్ణు పేర్కొన్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకకు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను తలపిస్తూ ‘మా’ ఎన్నికలు జరిగాయి. ‘మా’ కుటుంబ అభివృద్ధిని తన భుజాలపై వేసుకొని సభ్యుల సంక్షేమం కోసం విష్ణు ముందుకు రావడం అభినందనీయం. మోహన్‌బాబుకు కోపం, ఆవేశం ఎక్కువ. ఆ గుణాలు ఆయనకే చేటు చేశాయి . ‘మా’ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుంది’ అని తెలిపారు. మోహన్‌బాబు మాట్లాడుతూ “మా’లో రాజకీయాలు ఉండకూడదు. ఇది కళాకారుల వేదిక కానీ రాజకీయ వేదిక కాదు. ఎన్నికల సమయంలో కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. దేశం గర్వించే స్థాయిలో ‘మా’ను అభివృద్ధి చేయాలి. అసోసియేషన్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నేను కలుస్తాను. ‘మా’ అధ్యక్షుడు అనేది ఉద్యోగం కాదు బాధ్యత. విష్ణు తాను ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతాడనే నమ్మకముంది’ అని చెప్పారు. మంచు విష్ణు మాట్లాడుతూ ‘ ఈ రెండేళ్లు నేను ఏం చేయగలనో చేసి చూపిస్తాను. ప్రకాష్‌రాజ్ ప్యానల్ రాజీనామా చేయడం దురదృష్టకరం. అసోసియేషన్ అభివృద్ధి కోసం వారి సలహాలను స్వీకరిస్తా. గతాన్ని గురించి కాకుండా ఇకపై చేయబోయే పనుల గురించే మాట్లాడతాం’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- maa association
- Vishnu
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

