Lucifer 2 Empuraan | మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) ప్రధాన పాత్రల్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం లూసిఫర్ (Lucifer). మంజు వారియర్ (Manju Warrier), వివేక్ ఒబెరాయ్ (Vivek Oberai), టోవినో థామస్ (Tovino Thomas) లు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వం వహించాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం 2019 కేరళలో బిగ్గెస్టు బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఇదే సినిమాను మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గాడ్ ఫాదర్ (God Father 2022) పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు. ఈ చిత్రానికి తని ఓరువన్ (Thani Oruvan) ఫేమ్ మోహన్ రాజా (Mohan Raaja) దర్శకత్వం వహించాడు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ఈ చిత్రం నుంచి సీక్వెల్ వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. లూసిఫర్ 2 ఎంపురాన్ (Lucifer 2 Empuraan) అనే టైటిల్‌తో ఈ సినిమా రానుండగా.. ఈ మూవీ నుంచి ఓ సాలిడ్ అప్డేట్ వచ్చింది.
తాజాగా మేకర్స్ సినిమా షూటింగ్ అప్డేట్ను వెల్లడించారు. నేటి నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్లు.. సీక్వెల్ సంబంధించి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు. ఇక ఫస్ట్ షెడ్యూల్‌కు సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలో షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు టాక్. ఆ తర్వాత అక్కడ నుంచి లడఖ్‌లో షూటింగ్ జరుపుకోనున్నట్లు సమాచారం. ఇక సీక్వెల్‌కు కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం చేయనుండగా మురళి గోపి స్టోరీ అందిస్తున్నాడు. కాగా ఇందులో సూపర్ స్టార్ మోహన్ లాల్ మరింత స్టైలిష్‌గా కనిపించనున్నాడు.
Finally #L2 #Empuraan begins….. pic.twitter.com/hn4YHjUiHt
— Sreedhar Pillai (@sri50) October 5, 2023
ఇదిలా ఉంటే.. పృథ్విరాజ్‌కు దర్శకుడిగా ఇది మూడో సినిమా. మూడు సినిమాల్లో మోహన్‌లాల్ ప్రధాన హీరోగా ఉండటం విశేషం. ఇక ఈ సీక్వెల్ సినిమాను డబ్బును మంచి నీళ్ళలా ఖర్చు పెట్టే లైకా సంస్థ టేకోవర్ చేసుకుంది. దాంతో అటు తమిళంలో కూడా ఈ సినిమాపై మంచి హైప్ వచ్చింది. వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేసి వచ్చే ఏడాది పాన్ ఇండియా లెవల్లో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Rolling from today #L2 #Empuraan pic.twitter.com/BJI4ZcEUu1
— Sreedhar Pillai (@sri50) October 5, 2023