Vijay Devarakonda | రౌడీ హీరోది ప్రేమ వివాహమేనట!
ఏ విషయంలోనైనా సరే సూటిగా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం ఆయన నైజం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన తాజా చిత్రం ‘ఫ్యామిలీస్టార్' ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
Vijay Devarakonda | ఏ విషయంలోనైనా సరే సూటిగా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం ఆయన నైజం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన తాజా చిత్రం ‘ఫ్యామిలీస్టార్’ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా తమిళనాడులో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలపై విజయ్ దేవరకొండ మాట్లాడారు. పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘నేను ప్రేమ వివాహమే చేసుకుంటా. పెళ్లి చేసుకొని తండ్రి కావాలని ఉంది. అయితే నా పెళ్లికి ఇంకా టైముంది.
నేను పెళ్లాడబోయే అమ్మాయి నా పేరెంట్స్‌కు తప్పకుండా నచ్చాలి’ అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తమిళంలో కూడా కొన్ని కథలు విన్నానని, త్వరలో ఆ సినిమాలు కార్యరూపం దాల్చుతాయని విజయ్ దేవరకొండ తెలిపారు. తమిళనాడులో ఈ సినిమాను 250 థియేటర్లలో విడుదల చేస్తున్నామని నిర్మాత దిల్‌రాజు పేర్కొన్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘గీత గోవిందం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రమిదే కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

