Love Me Movie Review | రొమాంటిక్ హారర్ ‘లవ్మీ’ ఆడియన్స్‌ని ఆకట్టుకుందా?
Love Me Movie | టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సోంత బ్యానర్ దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై టాలీవుడ్ యువ నటులు ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘లవ్మీ’. ‘ఇఫ్ యు డేర్’ ఉపశీర్షిక.
Love Me Movie Review | ‘లవ్మీ’ మూవీ రివ్యూ..
సినిమా పేరు : ‘లవ్మీ’
తారాగణం: ఆశిష్, వైష్ణవి చైతన్య
దర్శకత్వం: అరుణ్ భీమవరపు
నిర్మాత: హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి
విడుదల : మే 25
Love Me Movie | టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సోంత బ్యానర్ దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై టాలీవుడ్ యువ నటులు ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘లవ్మీ’. ‘ఇఫ్ యు డేర్’ ఉపశీర్షిక. రొమాంటిక్ హారర్ వచ్చిన ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించగా.. హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలంగాణలో గత వారం నుంచి థియేటర్లు బంద్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా లవ్ మీ సినిమాతో మళ్లీ తెరచుకున్నాయి. ఇక ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అర్జున్(ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతుంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలు ఇలాంటి ఘోస్ట్ కాన్సెప్ట్లపై వీడియోలు చేస్తుంటారు. ఇక ప్రతాప్ గర్ల్ ఫ్రెండ్ ప్రియా(వైష్ణవి చైతన్య) కూడా వీళ్ళతో కలిసి పనిచేస్తుంది.. అయితే ఒక ఊరిలో దెయ్యం ఉందని దానికి చూడడానికి వెళ్లిన వాళ్ళందరిని చంపేస్తుందని అర్జున్ చెవిన పడుతుంది. దీంతో ఆ దెయ్యం సంగతి ఎంటో చూద్దామని అర్జున్ ఆ ప్రదేశానికి వెళతాడు. అయితే ఆ దెయ్యంను చూసిన అర్జున్ ఆమెతో ప్రేమలో పడతాడు. ఇక అక్కడున్న అమ్మాయి దెయ్యంగా ఎలా మారింది. అసలు మధ్యలో దివ్యవతి ఎవరు? ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరు? ఎలా చనిపోయారు? అర్జున్ దయ్యాన్ని ఎందుకు ప్రేమించాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ : ఇటీవల కాలంలో యువతకి నచ్చే రొమాంటిక్ హారర్ సినిమాలు చాలా తక్కువగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత వచ్చిన మంచి రొమాంటిక్ హారర్ సినిమా ‘లవ్మీ’ అని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా అర్జున్ గురించి, అర్జున్ దివ్యవతి గురించి వెతుకుతూ వెళ్లడం, అక్కడ దయ్యంతో సీన్స్ తో ఇంటర్వెల్ సాగుతుంది. ఇక సెకండ్ ఆఫ్‌లో ముగ్గురు అమ్మాయిల గురించి, దివ్యవతి గురించి అర్జున్ చేసే రీసెర్చ్ ఉంటుంది. అయితే ప్రీ క్లైమాక్స్‌లో కథ కొంచెం కన్ఫ్యుజింగ్ గా ఉంటుంది.
నటీనటులు: రౌడీ బాయ్స్ సినిమాతో కాలేజీ కుర్రాడిగా అలరించిన ఆశిష్ ఇప్పుడు లవ్ మీ అంటూ హార్రర్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బేబీతో గతేడాది బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఆశిష్ అర్జున్ పాత్రలో జీవించగా.. వైష్ణవి చైతన్య తన నటనతో అలరించింది. ఇక సిమ్రాన్ చౌదరి, రవికృష్ణ తదితరులు వారి వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతికంగా : ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ విజువల్స్ హైలైట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకు PC శ్రీరామ్ కెమెరామెన్. PC శ్రీరామ్ అంటే ఆ సినిమాలో విజువల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక కథకు తగ్గట్టుగానే అద్భుతమైన విజువల్స్ అందించారు PC శ్రీరామ్. మూవీలో సంగీతం కూడా బాగుంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది అని చెప్పాలి. ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం సమకుర్చాడు. ఆర్ట్ డైరెక్టర్ లొకేషన్స్ ని అద్భుతంగా డిజైన్ చేసాడు. ముఖ్యంగా దెయ్యం గృహాన్ని ఆర్ట్ డిపార్ట్మెంట్ చక్కదిద్దిన తీరు, అభినందనీయం. దర్శకుడిగా అరుణ్ మొదటి సినిమాతో సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు.
రేటింగ్: 2.5/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

