‘లవ్మీ’లో అన్నీ సర్‌ప్రైజ్‌లే..!
“లవ్మీ’ సినిమా చాలా సర్‌ప్రైజ్‌లుంటాయి. ఊహకందని మలుపులు, చక్కటి ప్రేమకథతో ఆకట్టుకుంటుంది’ అన్నారు యువ హీరో ఆశిష్. ఆయన నటించిన తాజా చిత్రం ‘లవ్మీ’. అరుణ్ భీమవరపు దర్శకుడు.
“లవ్మీ’ సినిమా చాలా సర్‌ప్రైజ్‌లుంటాయి. ఊహకందని మలుపులు, చక్కటి ప్రేమకథతో ఆకట్టుకుంటుంది’ అన్నారు యువ హీరో ఆశిష్. ఆయన నటించిన తాజా చిత్రం ‘లవ్మీ’. అరుణ్ భీమవరపు దర్శకుడు. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం ఆశిష్ పాత్రికేయులతో పంచుకున్న విశేషాలివి..
- గత చిత్రాలకు భిన్నంగా కాస్త డార్క్షేడ్లో నా క్యారెక్టర్ సాగుతుంది. ఈ సినిమాలో నేను యూట్యూబర్‌గా కనిపిస్తాను. ఓ దెయ్యానికి సంబంధించిన స్టోరీ విషయంలో అతనికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ఆద్యంతం ఆసక్తికరంగా అనిపిస్తుంది.
- ఈ సినిమాలో దెయ్యం ఎవరన్నది సస్పెన్స్. అందరూ అనుకుంటున్నట్లుగా కథానాయిక వైష్ణవి చైతన్యది దెయ్యం పాత్ర కాదు. కథానుగుణంగా ఐదారుగురు నాయికలు కనిపిస్తారు. చిత్ర దర్శకుడు అరుణ్ నవలా రచయిత కాబట్టి ఈ సినిమాను ఎమోషనల్‌గా తెరకెక్కించాడు.
- ఈ సినిమాలో హారర్ ఓ భాగం మాత్రమే. ఓ పెద్ద సమస్యకు పరిష్కారాన్ని కనుక్కునే యువకుడిగా నా పాత్ర భిన్న కోణాల్లో సాగుతుంది. ఈ కథలో పగ, ప్రతీకారం వంటి అంశాలు ఉండవు. చక్కటి ప్రేమకథగా మెప్పిస్తుంది. ైక్లెమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ సర్ప్రైజ్కు గురిచేస్తుంది.
- ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా పీసీ శ్రీరామ్, సంగీత దర్శకుడిగా కీరవాణి వంటి లెజెండ్స్ పనిచేశారు. వారితో కలిసి వర్క్ చేయడం వల్ల ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నా. పీసీ శ్రీరామ్‌గారి కెమెరా వర్క్ కథను మరింతగా ఎలివేట్ చేసింది.
- ఈ సినిమా ైక్లెమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఉంటుంది. కథాపరంగా సీక్వెల్‌కు అవకాశం ఉంది. ఇప్పటివరకైతే సీక్వెల్ చేయాలని అనుకోవడం లేదు. ఈ విషయంలో దిల్‌రాజుగారు నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం ‘సెల్ఫిష్’ చిత్రాన్ని చేస్తున్నా. అది పూర్తయ్యాక సితార సంస్థలో ఓ సినిమాలో నటించబోతున్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

