Ranbir Kapoor | బాలీవుడ్లో ఎన్నో జనరంజకమైన చిత్రాలను అందించారు అగ్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ. కథాంశాల్లో వైవిధ్యం, మేకింగ్‌లో భారీతనంతో ఆయన చిత్రాలు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంటాయి. ‘లవ్ అండ్ వార్’ పేరుతో బుధవారం ఆయన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాలో రణ్‌భీర్‌కపూర్, అలియాభట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలను పోషించనున్నారు.
ముక్కోణపు ప్రేమకథా చిత్రమిదని సమాచారం. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘సావరియా’ చిత్రంలో రణ్‌భీర్‌కపూర్, ‘గంగూభాయి కతియావాడి’లో అలియాభట్ నటించిన విషయం తెలిసిందే. ‘లవ్ అండ్ వార్’ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం రణ్‌వీర్‌సింగ్ కథానాయకుడిగా సంజయ్‌లీలా భన్సాలీ ‘బైజు బర్వా’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. రణ్‌భీర్‌కపూర్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్’ ఇటీవలే విడుదలైన అపూర్వ విజయాన్ని సాధించింది.